SSC కానిస్టేబుల్ GD రిక్రూట్‌మెంట్ 2026 కోసం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా ఈ రిక్రూట్ మెంట్ కు సంబంధించిన, రాష్ట్రం, బలగాల వారీగా పోస్టుల వివరాలు విడుదలయ్యాయి. జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఈ నియామకం ద్వారా మొత్తం 25487 పోస్టులను నియమించనున్నారు. నోటిఫికేషన్ ప్రకారం, బిఎస్ఎఫ్ 616 పోస్ట్‌లు, సిఐఎస్ఎఫ్ 14595 పోస్ట్‌లు, సిఆర్‌పిఎఫ్ 5490 పోస్ట్‌లు, ఎస్.ఎస్.బి. 1764 పోస్ట్‌లు, ఐటీబీపీ 1293 పోస్ట్‌లు, ఎఆర్ 1706 పోస్ట్‌లు, ఎస్.ఎస్.ఎఫ్. 23 పోస్ట్‌లు భర్తీ కానున్నాయి. ఈ పోస్టులలో 23467 పోస్టులు పురుష అభ్యర్థులకు రిజర్వ్ చేశారు. 2020 పోస్టులు మహిళా అభ్యర్థులకు రిజర్వ్ చేశారు. ఏ రాష్ట్రంలో ఎన్ని పోస్టులున్నాయో తెలుసుకోవడం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
Also Read:Niveda Pethuraj : టాలీవుడ్‌లో మరో బ్రేక్ అప్.. ఎంగేజ్‌మెంట్ పోస్ట్ డిలీట్ చేసిని హీరోయిన్
SSC GD కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి లేదా మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 23 సంవత్సరాలు మించకూడదు. రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
Also Read:Director Sandeep Raj: అఖండ 2 రిలీజ్ దెబ్బకు ‘మోగ్లీ’ వాయిదా.. నేనే బ్యాడ్‌లక్ అంటూ డైరెక్టర్ ఎమోషనల్
జనరల్, OBC, EWS కేటగిరీల అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. SC, ST, మాజీ సైనికులు, అన్ని కేటగిరీల మహిళా అభ్యర్థులకు పీజు నుంచి మినహాయింపునిచ్చారు. దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31, 2025 వరకు కొనసాగుతుంది. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in ని సందర్శించి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.