Site icon NTV Telugu

Chevireddy Bhaskar Reddy: బేస్తవారిపేటలో ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆత్మీయ విందు..

Chevireddy

Chevireddy

ఒంగోలు లోక్ సభ నియోజక వర్గం నుంచి వైసీపీ తరపున చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తు్న్న ఆయన.. ఈ రోజు బేస్తవారిపేటలో ఆత్మీయ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ ప్రొగ్రాంకు గిద్దలూరు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కేపీ నాగార్జున రెడ్డి, మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న రాంబాబుతో పాటు కంభం మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాసరెడ్డి, మండల పరిషత్ అధ్యక్షులు ఓసూరా రెడ్డి, జడ్పీటీసీ వెంకటరాజు, మండల కన్వీనర్ జేసీఎస్ కన్వీనర్, సర్పంచులు, ఎంపీటీసీలు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read Also: Rahul Gandhi: భారతదేశానికి ఒకే నాయకుడు ఉండాలన్నదే బీజేపీ ఆలోచన..

కాగా, వైసీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. 16 సంవత్సరాల వయసు నుంచి వైఎస్ రాజారెడ్డి శిష్యుడిగా దివంగత వైఎస్సార్ కు తమ్ముడిగా రాజకీయాలలో అడుగిడానని, నా జీవితం మొత్తం వైఎస్సార్ కుటుంబానికి అంకితం అని ఒంగోలు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. ఇక, ప్రజల్లో మద్దతు లేకపోవటంతో టీడీపీ నేతలు మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో అభ్యర్థుల తరఫున కుటుంబ సభ్యులు ప్రచారం చేయటం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. దాడులకు పురికొల్పింది, ఘర్షణలకు పాల్పడింది టీడీపీ వాళ్లు.. ప్రణాళికాబద్ధంగా ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారని ఆయన మండిపడ్డారు. కొంతమంది అధికారులను తమ ఫిర్యాదుతో బెదిరింపులకు పాల్పడాలని చూస్తున్నారు అంటూ ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు.

Exit mobile version