Site icon NTV Telugu

Aarogyasri: ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రుల్లో కొనసాగుతున్న సేవల నిలిపివేత.. నెలకు రూ.100 కోట్లు ఇస్తామని చెప్పినా..

Arogya Sri

Arogya Sri

తెలంగాణలో అర్ధరాత్రి నుంచే ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వం నెలకు వంద కోట్ల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చినా పట్టువీడని నెట్ వర్క్ ఆస్పత్రులు.. నెలకు కనీసం 500 కోట్లు విడుదల చేయాలని పట్టుబడుతున్న నెట్ వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్.. సమ్మెపై వెనక్కి తగ్గేది లేదని నెట్ వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ ప్రెసిడెంట్ వద్దిరాజు రాకేష్ తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగించాలని ప్రైవేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలకు ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ కోరారు.

Also Read:ilaiyaraaja : ఇళయరాజా కారణంగా నెట్ ఫ్లిక్స్ నుండి స్టార్ హీరో సినిమా డిలీట్

వైద్య సేవల నిలిపివేత నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని సీఈవో ఉదయ్ కుమార్ సూచించారు. గడిచిన 21 నెలల్లో 1779 కోట్లను హాస్పిటళ్లకు ప్రభుత్వం చెల్లించిందని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 1375 వైద్య చికిత్సల చార్జీలను సగటున 22 శాతానికిపైగా పెంచము. చార్జీల పెంపు, కొత్త ప్యాకేజీల చేర్పుతో అదనంగా 487.29 కోట్లు పేషెంట్ల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తోందని వెల్లడించారు.

Exit mobile version