Srisailam Project: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
- శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
- కుడి..ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతోన్న విద్యుత్ ఉత్పత్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam Project: కృష్ణా బేసిన్ ఎగువ పరీవాహకంలో వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరదనీరు పెరిగింది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి భారీగా వరద వస్తుండగా.. అంతేస్థాయిలో శ్రీశైలానికి వదులుతున్నారు. రెండు వైపులా జలవిద్యుత్తు ఉత్పాదనతో శ్రీశైలం నుంచి 69,132 క్యూసెక్కులను నాగార్జున సాగర్‌కు వదిలేస్తున్నారు. శ్రీశైలం జలాశయం ఘాట్‌రోడ్డులో ఇటీవల కురిసిన భారీ వర్షానికి కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే.
Read Also: AP High Court: ఆ నిర్మాణాలపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు?.. అధికారులను ప్రశ్నించిన హైకోర్టు
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్‌ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
శ్రీశైలం జలాశయానికి 1,37,849 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండగా.. ఔట్ ఫ్లో 69,132 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.20 అడుగుల మేర నీటిమట్టం ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలుగా.. ప్రస్తుతం 210.9946 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. వరద ఇలాగే కొనసాగితే శ్రీశైలం జలాశయ గేట్లు మరోసారి ఎత్తే అవకాశం ఉంది. మళ్లీ శ్రీశైలం గేట్లు ఎప్పుడు ఎత్తుతారోనని పర్యాటక ప్రేమికులు ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్‌ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్‌వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!