OnePlus Watch 2 Price: ‘వన్‌ప్లస్ వాచ్ 2’ వచ్చేసింది.. 100 గంటల బ్యాటరీ లైఫ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OnePlus Watch 2 Price and Offers: వన్‌ప్లస్ కంపెనీ తన సరికొత్త స్మార్ట్‌వాచ్ ‘వన్‌ప్లస్ వాచ్ 2’ను బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో లాంచ్ అయింది. భారత్‌లో మార్చి 4 నుంచి వన్‌ప్లస్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ఈ వాచ్ విక్రయానికి అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌వాచ్ డ్యూయల్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తుంది. వన్‌ప్లస్ వాచ్ 2 ధర రూ.24,999గా నిర్ణయించారు. డిస్కౌంట్లు, బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.22,999కే అందుబాటులో ఉంటుంది. ఈ వాచ్ రెండు రంగుల్లో (బ్లాక్ స్టీల్, రేడియంట్ స్టీల్) వస్తుంది.
వన్‌ప్లస్ వాచ్ 2ను కేవలం ఆండ్రాయిడ్ ఫోన్‌తో మాత్రమే అనుసంధానం చేయొచ్చు. ఐఫోన్, ఆండ్రాయిడ్ గో-పవర్డ్ స్మార్ట్‌ఫోన్‌లతో ఈ వాచ్‌ను ఉపయోగించలేం. బ్యాటరీ లైఫ్ కోసం వన్‌ప్లస్ ఈ వాచ్‌లో స్నాప్‌డ్రాగన్ డబ్ల్యూ5 (వేర్‌ఓఎస్ కోసం), ఆర్‌టీఓఎస్ కోసం బీఈఎస్2700 ప్రాసెసర్లను వినియోగించింది. దీంతో స్మార్ట్ మోడ్‌లో 100 గంటలు, ఆర్‌టీఓఎస్ మోడ్‌లో 48 గంటల వరకు బ్యాటరీలైఫ్ ఉంటుంది. ఇక పవర్ సేవర్ మోడ్‌లో 12 రోజుల వరకు ఛార్జింగ్ ఉంటుంది.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
Also Read: Vodafone Idea : ఆ విధంగా రూ.45,000 కోట్లను సమీకరించనున్న వొడాఫోన్ ఐడియా
వన్‌ప్లస్ వాచ్ 2లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే.. 24 గంటల బ్యాటరీ లైఫ్ వస్తుంది. పూర్తిగా ఛార్జ్ కావడానికి 60 నిమిషాల సమయం పడుతుంది. 466x466p రిజల్యూషన్‌తో కూడిన 1.43 అంగుళాల సర్క్యులర్ డిస్‌ప్లేను ఇచ్చారు. దీనికి సఫైర్ క్రిస్టల్ గ్లాస్ ప్రొటెక్షన్, స్టెయిన్‌లెస్ స్టీల్ చాసిస్ ఉంటుంది. 100కి పైగా వాచ్ ఫేస్‌లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. 100 స్పోర్ట్ మోడ్‌లు ఉన్నాయి. అయితే సెల్యులార్ కనెక్టివిటీ సదుపాయం మాత్రం లేదు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!