Site icon NTV Telugu

OnePlus Pad Lite: 11 అంగుళాల FHD+ డిస్‌ప్లే, 9340mAh బ్యాటరీతో భారత్ లో కొత్త వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ లాంచ్..!

Oneplus Pad Lite

Oneplus Pad Lite

OnePlus Pad Lite: ప్రముఖ టెక్ బ్రాండ్ వన్‌ప్లస్ (OnePlus) తన తాజా ట్యాబ్లెట్ OnePlus Pad Lite ను భారత్‌లో అధికారికంగా విడుదల చేసింది. గతంలో గ్లోబల్ మార్కెట్‌లో పరిచయమైన ఈ ట్యాబ్‌ను, కంపెనీ ఇప్పుడు భారత వినియోగదారుల కోసం మరింత ఆకర్షణీయమైన ధరలో అందుబాటులోకి తీసుకొచ్చింది. వన్‌ప్లస్ ఫోన్ యూజర్లకు ప్రత్యేక అనుభవాన్ని అందించేలా ఈ ట్యాబ్లెట్‌ను తీర్చిదిద్దారు. మరి ఈ కొత్త ట్యాబ్లెట్ గురించి పూర్తి వివరాలు చూద్దామా..

డిస్ప్లే:
OnePlus Pad Lite ట్యాబ్‌లో 11 అంగుళాల FHD+ (1920×1200 పిక్సెల్స్) LCD డిస్‌ప్లే ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ ను, 16:10 అస్పెక్ట్ రేషియోను కలిగి ఉంటుంది. డిస్‌ప్లే బ్రైట్‌నెస్ అంతా మిలిపెరటింగ్స్ వద్ద 500 నిట్స్ వరకు అందించగలదు. ఇది వీడియోలు చూడడానికి, పుస్తకాలు చదవడానికి ఇంకా గేమింగ్‌కి మంచి అనుభూతి ఇస్తుంది.

Realme NARZO 80 Lite 4G: కేవలం రూ.6,599కే మిలిటరీ గ్రేడ్ ఫోన్.. 6300mAh భారీ బ్యాటరీతోపాటు మరిన్ని ఫీచర్స్..!

పవర్‌ఫుల్ ప్రాసెసర్:
ఇందులో ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో G100 6nm చిప్‌సెట్ ఉపయోగించబడింది. ఇది 2x Cortex-A76 @ 2.2GHz + 6x Cortex-A55 @ 2.0GHz స్పీడ్‌లో పనిచేస్తుంది. 6GB లేదా 8GB LPDDR4X ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజ్ వేరియంట్లలో ఇది లభిస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OxygenOS 15.0.1 పై రన్ అవుతుంది.

కెమెరా, సౌండ్, కనెక్టివిటీ:
ఈ కొత్త ట్యాబ్లెట్ లో ముందు, వెనుక వైపులా 5MP కెమెరాలు ఉన్నాయి. వీటితో 1080p @ 30fps వీడియో రికార్డింగ్‌కి సపోర్ట్ లభిస్తుంది. ఆడియో అనుభవం కోసం ఇందులో క్వాడ్ స్పీకర్స్ విత్ Hi-Res సర్టిఫికేషన్ ఉన్నాయి. Omnibearing Sound Field అనే వన్ ప్లస్ ప్రత్యేక ఫీచర్ ద్వారా స్క్రీన్ ఒరియంటేషన్‌ను బట్టి సౌండ్ దిశను ఆటోమేటిక్‌గా మార్చుతుంది. కాబట్టి సినిమా, మ్యూజిక్, గేమ్స్‌కి అదిరిపోయే అనుభూతిని అందిస్తుంది.

ఇక ప్రత్యేకమైన OnePlus ఎకోసిస్టమ్ ఫీచర్ల విషయానికి వస్తే.. స్క్రీన్ మిర్రరింగ్ ద్వారా వన్ ప్లస్ ఫోన్‌ను స్క్రీన్‌పై కంట్రోల్ చేయవచ్చు. అలాగే క్లిప్ బోర్డు షేరింగ్, షేర్డ్ గేలరీల ద్వారా.. ఫోన్, ట్యాబ్ ల మధ్య కంటెంట్ ట్రాన్స్ఫర్ సులభం అవుతుంది. అలాగే ఓపెన్ కాన్వాస్ ద్వారా రెండు యాప్స్‌ను ఒకే సమయంలో పరస్పరం విండో సైజులతో ఓపెన్ చేయవచ్చు. అంతేకాకుండా.. క్విక్ షేర్ (ఆండ్రాయిడ్), O+ కనెక్ట్ (iOS/iPadOS) ద్వారా క్రాస్-ప్లాట్‌ఫాం ఫైల్ షేరింగ్ సపోర్ట్ లభిస్తుంది.

Moto g86 Power 5G: 50MP OIS కెమెరా, 6720mAh బ్యాటరీ లాంటి ప్రీమియం ఫీచర్లతో అలరించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసిన మోటోరోలా..!

భారీ బ్యాటరీ:
ఈ ట్యాబ్‌లో 9340mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది 33W SUPERVOOC ఫాస్ట్ చార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 11 గంటల వరకూ వీడియో ప్లేబ్యాక్ సపోర్ట్ అందిస్తుంది.

ధర:
ఈ వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో 6GB + 128GB (Wi-Fi) వేరియంట్ ధర రూ.15,999 కాగా.. ఆఫర్ ధరలో కేవలం రూ.12,999కే లభిస్తుంది. అలాగే 8GB + 128GB (LTE) వేరియంట్ ధర రూ.17,999 కాగా ఆఫర్ కింద రూ.14,999లకే లభిస్తుంది. కొన్ని ఎంపిక బ్యాంకులతో 6 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆఫర్ కూడా లభ్యమవుతుంది. OnePlus Pad Lite ట్యాబ్‌ను ఆగస్ట్ 1 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆన్లైన్, ఆఫ్ లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో కొనుగోలు చేయవచ్చు.

Exit mobile version