OnePlus Pad Lite: 11 అంగుళాల FHD+ డిస్ప్లే, 9340mAh బ్యాటరీతో భారత్ లో కొత్త వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ లాంచ్..!
- OnePlus Pad Lite భారత్‌లో అధికారికంగా విడుదల
- 11 అంగుళాల FHD+ డిస్ప్లే, 9340mAh బ్యాటరీ
- Omnibearing Sound Field అనే వన్ ప్లస్ ప్రత్యేక ఫీచర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OnePlus Pad Lite: ప్రముఖ టెక్ బ్రాండ్ వన్‌ప్లస్ (OnePlus) తన తాజా ట్యాబ్లెట్ OnePlus Pad Lite ను భారత్‌లో అధికారికంగా విడుదల చేసింది. గతంలో గ్లోబల్ మార్కెట్లో పరిచయమైన ఈ ట్యాబ్‌ను, కంపెనీ ఇప్పుడు భారత వినియోగదారుల కోసం మరింత ఆకర్షణీయమైన ధరలో అందుబాటులోకి తీసుకొచ్చింది. వన్‌ప్లస్ ఫోన్ యూజర్లకు ప్రత్యేక అనుభవాన్ని అందించేలా ఈ ట్యాబ్లెట్‌ను తీర్చిదిద్దారు. మరి ఈ కొత్త ట్యాబ్లెట్ గురించి పూర్తి వివరాలు చూద్దామా..
డిస్ప్లే:
OnePlus Pad Lite ట్యాబ్‌లో 11 అంగుళాల FHD+ (1920×1200 పిక్సెల్స్) LCD డిస్ప్లే ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ ను, 16:10 అస్పెక్ట్ రేషియోను కలిగి ఉంటుంది. డిస్ప్లే బ్రైట్నెస్ అంతా మిలిపెరటింగ్స్ వద్ద 500 నిట్స్ వరకు అందించగలదు. ఇది వీడియోలు చూడడానికి, పుస్తకాలు చదవడానికి ఇంకా గేమింగ్‌కి మంచి అనుభూతి ఇస్తుంది.
Also Read
- Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
- Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
- CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్‌గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
పవర్ఫుల్ ప్రాసెసర్:
ఇందులో ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో G100 6nm చిప్సెట్ ఉపయోగించబడింది. ఇది 2x Cortex-A76 @ 2.2GHz + 6x Cortex-A55 @ 2.0GHz స్పీడ్‌లో పనిచేస్తుంది. 6GB లేదా 8GB LPDDR4X ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజ్ వేరియంట్లలో ఇది లభిస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OxygenOS 15.0.1 పై రన్ అవుతుంది.

కెమెరా, సౌండ్, కనెక్టివిటీ:
ఈ కొత్త ట్యాబ్లెట్ లో ముందు, వెనుక వైపులా 5MP కెమెరాలు ఉన్నాయి. వీటితో 1080p @ 30fps వీడియో రికార్డింగ్‌కి సపోర్ట్ లభిస్తుంది. ఆడియో అనుభవం కోసం ఇందులో క్వాడ్ స్పీకర్స్ విత్ Hi-Res సర్టిఫికేషన్ ఉన్నాయి. Omnibearing Sound Field అనే వన్ ప్లస్ ప్రత్యేక ఫీచర్ ద్వారా స్క్రీన్ ఒరియంటేషన్ను బట్టి సౌండ్ దిశను ఆటోమేటిక్‌గా మార్చుతుంది. కాబట్టి సినిమా, మ్యూజిక్, గేమ్స్‌కి అదిరిపోయే అనుభూతిని అందిస్తుంది.
ఇక ప్రత్యేకమైన OnePlus ఎకోసిస్టమ్ ఫీచర్ల విషయానికి వస్తే.. స్క్రీన్ మిర్రరింగ్ ద్వారా వన్ ప్లస్ ఫోన్‌ను స్క్రీన్‌పై కంట్రోల్ చేయవచ్చు. అలాగే క్లిప్ బోర్డు షేరింగ్, షేర్డ్ గేలరీల ద్వారా.. ఫోన్, ట్యాబ్ ల మధ్య కంటెంట్ ట్రాన్స్ఫర్ సులభం అవుతుంది. అలాగే ఓపెన్ కాన్వాస్ ద్వారా రెండు యాప్స్‌ను ఒకే సమయంలో పరస్పరం విండో సైజులతో ఓపెన్ చేయవచ్చు. అంతేకాకుండా.. క్విక్ షేర్ (ఆండ్రాయిడ్), O+ కనెక్ట్ (iOS/iPadOS) ద్వారా క్రాస్-ప్లాట్‌ఫాం ఫైల్ షేరింగ్ సపోర్ట్ లభిస్తుంది.

భారీ బ్యాటరీ:
ఈ ట్యాబ్‌లో 9340mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది 33W SUPERVOOC ఫాస్ట్ చార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 11 గంటల వరకూ వీడియో ప్లేబ్యాక్ సపోర్ట్ అందిస్తుంది.

ధర:
ఈ వన్‌ప్లస్ ప్యాడ్ లైట్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో 6GB + 128GB (Wi-Fi) వేరియంట్ ధర రూ.15,999 కాగా.. ఆఫర్ ధరలో కేవలం రూ.12,999కే లభిస్తుంది. అలాగే 8GB + 128GB (LTE) వేరియంట్ ధర రూ.17,999 కాగా ఆఫర్ కింద రూ.14,999లకే లభిస్తుంది. కొన్ని ఎంపిక బ్యాంకులతో 6 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆఫర్ కూడా లభ్యమవుతుంది. OnePlus Pad Lite ట్యాబ్‌ను ఆగస్ట్ 1 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆన్లైన్, ఆఫ్ లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో కొనుగోలు చేయవచ్చు.
తాజావార్తలు
-
Kalki 2: వచ్చే నెల నుంచే ‘కల్కి 2’ నాన్-స్టాప్ షూటింగ్!
-
SlumDog – 33 Temple Road: ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’ కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి… టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
-
Mobile Battery: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెడితే నిజంగానే బ్యాటరీ పాడవుతుందా? అసలు నిజం ఏమిటి?
-
Peddi : అప్పటి నుంచే జాన్వీ సీన్లు కట్ చేసిన ‘పెద్ది’!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
