Realme NARZO 80 Lite 4G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ (realme) బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ప్రియులకు మరో శుభవార్త ఇచ్చింది. తాజాగా realme NARZO 80 Lite 4G ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇటీవలే లాంచ్ అయిన C71 తర్వాత, ఇది కంపెనీ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. ఈ కొత్త మొబైల్ లో మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, భారీ బ్యాటరీ, లైట్ డిజైన్ వంటి ప్రత్యేకతలతో ఇది మరింత ఆకర్షణీయంగా ఉంది. మరి మొబైల్ పూర్తి ఫీచర్స్ ఏంటో ఒకసారి చూసేద్దామా..
ఈ రియల్‌మీ నార్జో 80 Lite 4G ఫోన్‌లో 6.67 అంగుళాల HD+ IPS LCD స్క్రీన్ (720×1600 పిక్సెల్స్) ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ను సపోర్ట్ చేస్తుంది. 563nits హెచ్‌బీఎం బ్రైట్‌నెస్‌తో ఇది వెలుతురు ప్రదేశాల్లోనూ బాగా పని చేస్తుంది. ఇక డిజైన్ విషయంలో.. ఈ ఫోన్‌లో ‘పల్స్ లైట్’ బ్యాక్ లైట్ డిజైన్ ఉంది. ఇది 5 రకాల కస్టమైజ్ మోడ్‌లను సపోర్ట్ చేస్తుంది. అలాగే ArmorShell ప్రొటెక్షన్ తో ఇది 1.8 మీటర్ల డ్రాప్ టెస్టులో పాసై మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్ పొందింది. IP54 రేటింగ్ వల్ల తేమ, ధూళికి వ్యతిరేకంగా రక్షణ అందిస్తుంది.
AP Cabinet Meeting: నేడు కేబినెట్ సమావేశం.. 42 అంశాల ఎజెండా!

ఇక ఈ కొత్త ఫోన్‌లో UNISOC T7250 (12nm) ఆక్టా-కోర్ ప్రాసెసర్ (1.8GHz) ఉంది. అలాగే ఇందులో Mali-G57 GPU, 4GB LPDDR4X RAM (వర్చువల్ RAM తో కలిపి 12GB వరకు విస్తరించవచ్చు), 64GB లేదా 128GB స్టోరేజ్ (microSD ద్వారా 2TB వరకు విస్తరించవచ్చు) ఉన్నాయి. అలాగే కెమెరా సెటప్ చూసినట్లయితే.. ఫోన్ వెనుక భాగంలో 13MP ఓమ్నివిజన్ OV13B సెన్సార్ కలిగిన కెమెరా (f/2.2 అప్రెచర్, LED ఫ్లాష్) ఉంది. ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరా (SC520CS సెన్సార్) ఏర్పాటు చేశారు. ఫోన్ రంగుల విషయానికి వస్తే.. ఇది ఒబిసిడియన్ బ్లాక్, బీచ్ గోల్డ్ అనే ఆకర్షణీయమైన రెండు కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

అలాగే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మీ UI 6.0 పై పని చేస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, 3.5mm ఆడియో జాక్, అల్ట్రా లీనియర్ బాటమ్ స్పీకర్, USB Type-C పోర్ట్ వంటి అవసరమైన కనెక్టివిటీలు ఇందులో ఉన్నాయి. అలాగే ఈ కొత్త ఫోన్‌లో డ్యూయల్ 4G VoLTE, Wi-Fi ac (2.4GHz/5GHz), Bluetooth 5.2, GPS, GLONASS, Galileo, QZSS లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. ఇది 6300mAh భారీ బ్యాటరీతో రాగా, 15W ఫాస్ట్ చార్జింగ్, 6W రివర్స్ వైర్డ్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
Crime News: అదృశ్యమైన యువకుడు హత్యకు గురి.. మేనమామే ప్లాన్ చేసి..?

realme NARZO 80 Lite 4G ఫోన్ రెండు వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంది. 4GB + 64GB వేరియంట్ ధర రూ.7,299గా ఉండగా, ప్రారంభ ఆఫర్ ధర కింద ఇది రూ.6,599కే లభిస్తుంది. అదే విధంగా 6GB + 128GB వేరియంట్ రూ.8,299గా ఉండగా, ఆఫర్ ధర కింద రూ.7,599కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ను అమెజాన్ ద్వారా కొనుగోలు చేసే వారికి ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు రూ.700 వౌచర్ ను పొందవచ్చు. లేదా రూ.500 వౌచర్ + రూ.200 బ్యాంక్ డిస్కౌంట్ ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. ఇక ఈ ఫోన్‌ను ముందుగా కొనాలి అనుకునే వారికి ఫ్లాష్ సేల్ జూలై 28న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. రెగ్యులర్ ఫస్ట్ సేల్ జూలై 31న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఫోన్‌ను రియల్‌మీ, అమెజాన్ వెబ్‌సైట్లలో కొనుగోలు చేయవచ్చు.
