Site icon NTV Telugu

OnePlus Pad Go Tablet : మార్కెట్లోకి రానున్న ‘వన్‌ప్లస్ పాడ్‌గో టాబ్లెట్’.. ఫీచర్స్ ఇవే?

One Plus

One Plus

OnePlus Pad Go Tablet : చైనీస్ టెక్ బ్రాండ్ వన్ ప్లస్ నుంచి వస్తున్న రెండవ టాబ్లెట్ వన్ ప్లస్ పాడ్ గో( OnePlus Pad Go). ఈ ఏడాది ప్రారంభంలోనే వన్ ప్లస్ మొదటిసారి టాబ్లెట్ ను వన్ ప్లస్ పాడ్ ( OnePlus Pad) పేరుతో తీసుకువచ్చింది. ఇక ఇప్పుడు మరో టాబ్లెట్ ను ఇండియన్ మార్కెట్ లోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. వన్ ప్లస్ పాడ్ గో( OnePlus Pad Go) కు సంబంధించిన వివరాలు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్‌సైట్‌లో కనిపించాయి. మోడల్ నంబర్ OPD2304 మరియు OPD2305 తో ఇవి కనిపించాయి.  అంతేకాకుండా వన్ నార్మల్ యూజర్ నేమ్  (@1NormalUsername) అనే ఒక ఎక్స్ (ట్విటర్) వినియోగదారుడు కూడా వన్ ప్లస్ పాడ్ గో, “OPD2304” గురించి సమాచారం అందించారు. అయితే తరువాత వెంటనే ఆ పోస్ట్ ను డిలీట్ చేశారు. అయితే దీని ఫీచర్స్ గురించి కానీ, ధర గురించి కానీ ఎలాంటి సమాచారం తెలియలేదు. కేవలం మోడల్ నెంబర్ మాత్రమే తెలిసిందే.

Also Read: Tragedy: రిసెప్షన్ రోజే కరెంట్ షాక్ తో పెళ్లికొడుకు మృతి

దీని వివరాలు తెలియకపోవడంతో ఇప్పటికే మార్కెట్లో ఉన్న వన్ ప్లస్ పాడ్ అప్ గ్రేడ్ అయి మార్కెట్లోకి వస్తుందని అనుకుంటున్నారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ క్లౌడ్ 11 ఈవెంట్‌లో వన్ ప్లస్ ప్యాడ్ ను ఆవిష్కరించారు. ఇది బ్యాకప్ కోసం  9,510mAh బ్యాటరీతో వచ్చింది. ఇది ఏప్రిల్ నుంచి మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చింది. ఇక దీని ధర రూ.37,999 కాగా 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ను కలిగి ఉంది. ఇక దీనిలోనే రూ.39,999 ఉన్న వేరెంట్12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ తో వచ్చింది. అయితే ఇది కేవలం ఒక్క కలర్ లోనే మార్కెట్ లోకి వచ్చింది. సింగిల్ హలో గ్రీన్ ఫినిష్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే ఇది అందుబాటులో ఉంది.

 

Exit mobile version