OnePlus Pad Go Tablet : మార్కెట్లోకి రానున్న ‘వన్‌ప్లస్ పాడ్‌గో టాబ్లెట్’.. ఫీచర్స్ ఇవే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OnePlus Pad Go Tablet : చైనీస్ టెక్ బ్రాండ్ వన్ ప్లస్ నుంచి వస్తున్న రెండవ టాబ్లెట్ వన్ ప్లస్ పాడ్ గో( OnePlus Pad Go). ఈ ఏడాది ప్రారంభంలోనే వన్ ప్లస్ మొదటిసారి టాబ్లెట్ ను వన్ ప్లస్ పాడ్ ( OnePlus Pad) పేరుతో తీసుకువచ్చింది. ఇక ఇప్పుడు మరో టాబ్లెట్ ను ఇండియన్ మార్కెట్ లోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. వన్ ప్లస్ పాడ్ గో( OnePlus Pad Go) కు సంబంధించిన వివరాలు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్‌సైట్‌లో కనిపించాయి. మోడల్ నంబర్ OPD2304 మరియు OPD2305 తో ఇవి కనిపించాయి. అంతేకాకుండా వన్ నార్మల్ యూజర్ నేమ్ (@1NormalUsername) అనే ఒక ఎక్స్ (ట్విటర్) వినియోగదారుడు కూడా వన్ ప్లస్ పాడ్ గో, “OPD2304” గురించి సమాచారం అందించారు. అయితే తరువాత వెంటనే ఆ పోస్ట్ ను డిలీట్ చేశారు. అయితే దీని ఫీచర్స్ గురించి కానీ, ధర గురించి కానీ ఎలాంటి సమాచారం తెలియలేదు. కేవలం మోడల్ నెంబర్ మాత్రమే తెలిసిందే.
Also Read: Tragedy: రిసెప్షన్ రోజే కరెంట్ షాక్ తో పెళ్లికొడుకు మృతి
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
దీని వివరాలు తెలియకపోవడంతో ఇప్పటికే మార్కెట్లో ఉన్న వన్ ప్లస్ పాడ్ అప్ గ్రేడ్ అయి మార్కెట్లోకి వస్తుందని అనుకుంటున్నారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ క్లౌడ్ 11 ఈవెంట్‌లో వన్ ప్లస్ ప్యాడ్ ను ఆవిష్కరించారు. ఇది బ్యాకప్ కోసం 9,510mAh బ్యాటరీతో వచ్చింది. ఇది ఏప్రిల్ నుంచి మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చింది. ఇక దీని ధర రూ.37,999 కాగా 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ను కలిగి ఉంది. ఇక దీనిలోనే రూ.39,999 ఉన్న వేరెంట్12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ తో వచ్చింది. అయితే ఇది కేవలం ఒక్క కలర్ లోనే మార్కెట్ లోకి వచ్చింది. సింగిల్ హలో గ్రీన్ ఫినిష్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే ఇది అందుబాటులో ఉంది.
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..