NTV Telugu Site icon

OnePlus 13: అద్భుతమైన బ్యాటరీ, 100 w ఫాస్ట్ ఛార్జింగ్‌.. ధర, ఫీచర్లు ఇవే

One Plus Lanch

One Plus Lanch

వన్ ప్లస్ తన తాజా ఫ్లాగ్‌షిప్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది. వన్ ప్లస్ 13 అనేది కంపెనీ తాజా ఫోన్.. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్‌ చిప్‌ అమర్చారు. ఈ ఫోన్ 24GB RAM+1TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. వన్ ప్లస్ యొక్క ఈ హ్యాండ్‌సెట్‌లో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 6.82 అంగుళాల అమోలెడ్‌ స్క్రీన్‌తో వస్తుంది. వన్ ప్లస్ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Cauliflower: క్యాలీఫ్లవర్ తింటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి..

OnePlus 13 ధర
వన్ ప్లస్ 13 బేస్ వేరియంట్ 12 జీబీ RAM, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,499 యువాన్లు (ఇండియా కరెన్సీలో సుమారు రూ. 53,100). అలాగే.. 12 జీబీ RAM, 512 జీబీ స్టోరేజ్ మోడల్ 4,899 యువాన్లకు (సుమారు రూ. 57,900) అందుబాటులోకి వచ్చింది. 16 GB RAM, 512 GB స్టోరేజ్ వేరియంట్ 5,299 చైనీస్ యువాన్ (సుమారు రూ. 62,600). 24 GB RAM, 1 TB స్టోరేజ్ మోడల్ ధర 5,999 యువాన్ (దాదాపు రూ. 70,900)గా నిర్ణయించారు. చైనాలో నవంబర్‌ 1 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. త్వరలో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు.

Oneplus 13 స్పెసిఫికేషన్స్
OnePlus 13 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ ఓఎస్ 15 పై పని చేస్తుంది. ఈ ఫోన్ 6.82 అంగుళాల క్వాడ్ HD + (1440×3168 పిక్సెల్స్) ఎల్‌టీపీఓ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 1Hz నుండి 120Hz మధ్య ఉంటుంది. స్క్రీన్ గరిష్ట ప్రకాశం 4500 నిట్‌ల వరకు ఉంటుంది.. ఇది డాల్బీ విజన్‌కు మద్దతు ఇస్తుంది. గ్రాఫిక్స్ కోసం Adreno 830 GPU ఉంది. డాల్బీ విజన్‌ సపోర్ట్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో వెనుక వైపు మొత్తం మూడు కెమెరాలు ఇచ్చారు. 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 50 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 50 ఎంపీ పెరిస్కోప్‌ టెలిఫొటో లెన్స్‌తో తీసుకొచ్చారు. ముందు వైపు 32 ఎంపీ కెమెరాను అమర్చారు.

ఈ హ్యాండ్‌సెట్‌లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, 4 మైక్రోఫోన్‌లు ఉన్నాయి. కనెక్టివిటీ కోసం.. 5G, 4G LTE, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, USB 3.2 Gen 1 టైప్-సి పోర్ట్ ఉన్నాయి. అలాగే.. ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, కలర్ టెంపరేచర్ సెన్సార్, ఈ-కంపాస్, యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, హాల్ సెన్సార్, లేజర్ ఫోకస్ సెన్సార్ మరియు స్పెక్ట్రల్ సెన్సార్ ఫోన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.. ఇది 100W ఫ్లాష్ ఛార్జ్ (వైర్డ్), 50W ఫ్లాష్ ఛార్జ్ (వైర్‌లెస్)కి మద్దతు ఇస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో రివర్స్ వైర్డ్ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

Show comments