NTV Telugu Site icon

OnePlus Mobiles Release: ఒకేరోజు రెండు మొబైల్స్‌ను విడుదల చేయబోతున్న వన్‌ప్లస్

One Plus 13

One Plus 13

OnePlus Mobiles Release: వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ సిరీస్ OnePlus 13, OnePlus 13R మొబైల్స్ విడుదల తేదీని అధికారికంగా ధృవీకరించింది. వన్‌ప్లస్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా పోస్టర్‌ను భాగస్వామ్యం చేసింది. ఈ పోస్టర్ ద్వారా వన్‌ప్లస్ జనవరి 7, 2025 న రాత్రి 9 గంటలకు OnePlus 13 సిరీస్ భారతదేశంలో ప్రారంభించబడుతుందని వెల్లడించింది. వన్‌ప్లస్ ఈ రెండు ఫోన్‌లను తన వింటర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రదర్శించబోతోంది. OnePlus 13 సిరీస్ ఇదివరకే చైనాలో ప్రవేశపెట్టబడింది. ఇక ఈ ఫోన్ లకు సంబంధించి ఫీచర్లు గురించి సమాచారాన్ని చూద్దాం.

ముందుగా OnePlus 13 లో Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్ ను వాడుతున్నారు. ఇక డిస్‌ప్లే పరంగా చూస్తే.. 6.82-అంగుళాల LTPO AMOLED స్క్రీన్, 3168×1440 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. అలాగే కెమెరా విషయంలో.. 50MP ప్రధాన కెమెరా, 50MP 3x టెలిఫోటో, 50MP అల్ట్రావైడ్, 32MP ఫ్రంట్ కెమెరా ఇందులో ఉన్నాయి. అలాగే బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 6,000mAh, 100W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ అందించనున్నారు. ఈ మొబైల్ కు IP68/69 రేటింగ్ ఉండగా, ఆండ్రాయిడ్ 15తో మొబైల్ రానుంది. ఇక OnePlus 13 ధర రూ. 70,000 కంటే తక్కువగా ఉండవచ్చని అంచనా.

Also Read: Today Gold Rates: తగ్గని బంగారం జోరు.. స్థిరంగా వెండి ధరలు

మరోవైపు, OnePlus 13R విషయానికి వస్తే.. ఇందులో Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ వాడుతున్నారు. ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే.. 6.78-అంగుళాల AMOLED స్క్రీన్, 2780×1264 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇక కెమెరా పరంగా 50MP ప్రధాన కెమెరా, 50MP 2x టెలిఫోటో, 8MP అల్ట్రావైడ్, 16MP ఫ్రంట్ కెమెరా ఉండనుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం ఏకంగా 6,000mAh తో రానుంది. దానిని 80W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వనుంది. ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో IP64 రేటింగ్, ఆండ్రాయిడ్ 15, OxygenOS 15 ఉండనున్నాయి. OnePlus 13 ధర రూ. 46,000 కంటే తక్కువగా ఉండవచ్చు.

Show comments