Accident: ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరులో ప్రమాదం జరిగింది. జి.కొండూరులోని పెట్రోల్ బంకు వద్ద వ్యాన్ టైర్లు పేలి వాహనం పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటనలో కలకోటి ప్రవీణ్ (36) అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
Read Also: Actor Suicide: పవిత్ర మృతి కేసులో ట్విస్ట్.. సహజీవనం చేస్తున్న నటుడు సూసైడ్?
అసలేం జరిగిందంటే.. మంగళగిరికి చెందిన కలపాల ప్రసాదరావు, దూరు ఇర్మీయా, మృతుడు కలకోటి ప్రవీణ్ గేదెల వ్యాపారం చేస్తుంటారు. శుక్రవారం తిరువూరులో గేదెలు కొనుగోలు చేసి మినీ వ్యానులో ఎక్కించుకొని మంగళగిరి బయలుదేరారు. మార్గమధ్యలో జి.కొండూరు పెట్రోల్ బంకు సమీపంలోకి రాగానే వ్యాన్ టైరు పేలి అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వ్యాను పైన కూర్చున్న కలకోటి ప్రవీణ్ మృతి చెందగా.. వ్యాను లోపల కూర్చున్న కలపాల ప్రసాదరావు, దూరు ఇర్మీయాలు స్వల్పంగా గాయపడ్డారు. జి.కొండూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ప్రైవేటు అంబులెన్స్‌లో పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ఆసుపత్రికి తరలించారు.