Site icon NTV Telugu

Hyderabad: రాయదుర్గంలో కారు బీభత్సం.. ఒకరి మృతి

Skiw

Skiw

హైదరాబాద్ రాయదుర్గం ఐక పర్నీచర్ షోరూం సమీపంలో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడుపుతూ పాదచారునిపైకి దూసుకెళ్తూ బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో నాలుగు మోటార్ సైకిళ్లు, ఆటోలను వేగనార్ కారు (TS07 EE 6048) ఢీకొట్టింది. ఈ ఘటనలో పాదచారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. మద్యం మత్తులో కారు నడిపిన వ్యక్తి క్రాంతి కుమార్ యాదవ్ (30) సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పోలీసులు గుర్తించారు. ఆదివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Revanth Reddy: ఆగస్ట్ 15 లోపు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతాం..

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని ప్రమాదస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్రాంతి కుమార్ యాదవ్‌ను ఆల్కహాల్ టెస్ట్ చేయగా 550 పర్సంటేజ్ వచ్చింది. మృతి చెందిన వ్యక్తి 25 సంవత్సరాల యువకుడిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. యువకుడి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నారు. బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: SRH vs RCB: భారీ స్కోరు చేసిన సన్ రైజర్స్.. ఆర్సీబీ బౌలర్లపై ఊచకోత

Exit mobile version