NTV Telugu Site icon

Copying in Group-1: గ్రూప్‌-1 పరీక్షల్లో కాపీయింగ్‌.. సెల్‌ఫోన్‌లో చూసి ఎగ్జామ్‌ రాస్తుండగా..

Copying

Copying

Copying in Group-1 Exam: ఏపీలో గ్రూప్‌-1 పరీక్ష ప్రశాంతంగా ప్రారంభం కాగా.. ఓ వ్యక్తి కాపీయింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. ఒంగోలు క్విస్‌ ఇంజినీరింగ్‌ కళాశాల పరీక్షా కేంద్రంలో కాపీ చేస్తూ ఓ అభ్యర్థి పట్టుబడ్డాడు. పరీక్షా కేంద్రంలో సెల్‌ఫోన్‌తో ప్రవేశించిన అభ్యర్థిని కాపీ చేస్తుండగా ఇన్విజిలేటర్‌ పట్టుకున్నారు. అతడిని కాలేజీ యాజమాన్యం పోలీసులకు అప్పగించారు. ఆ కాపీయింగ్ చేస్తున్న అభ్యర్థిని బేస్తవారిపేటకు చెందిన శివశంకర్‌గా గుర్తించారు. పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తనిఖీలు చేస్తున్నప్పటికీ వారి కళ్లుగప్పి సెల్‌ఫోన్‌ను పరీక్షా కేంద్రంలోకి తీసుకెళ్లాడు. ఆ అభ్యర్థిని ఒంగోలు పోలీసులు విచారిస్తున్నారు. పరీక్షా కేంద్రంలోకి అసలు సెల్ ఫోన్ ఎలా తీసుకు వెళ్లగలిగారని శివ శంకర్‌ను పోలీసులు విచారిస్తున్నారు.

Read Also: APPSC : రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోన్న ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష

ఇదిలా ఉండగా.. పరీక్ష జరుగుతున్న తీరును ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ పరిశీలింలించారు. ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. ఈ సారి అత్యధికంగా 1.48 లక్షల మంది అప్లై చేశారని, 18 జిల్లాలో 301 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్వామన్నారు. ఇవాళ్టి పరీక్షలో 72.3 శాతం హాజరు నమోదైందని ఆయన వెల్లడించారు. 6145 కెమెరాలతో , లైవ్ టీ వీ స్ట్రీమింగ్ చేస్తూ పర్యవేక్షిస్తున్నామని సవాంగ్‌ తెలిపారు. 2018 గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేయడంపై గౌతమ్ సవాంగ్ స్పందించారు. ప్రజాస్వామ్యంలో కోర్టుల్లో లిటిగేషన్ అనేది పార్ట్ ఆప్ ది ప్రాసెస్ అని, చరిత్ర చూస్తే కోర్టులో లిటిగేషన్ లేకుండా ఎక్కడా ప్రాసెస్ జరగలేదన్నారు.