Site icon NTV Telugu

One Nation One Election: ‘ఒక దేశం-ఒకే ఎన్నికల’ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తాం..?

Rajnath Singh

Rajnath Singh

Lok Sabha Elections 2024: ఎన్‌డీఏ మళ్లీ అధికారంలోకి వస్తే ‘ఒక దేశం-ఒకే ఎన్నికల’ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ భూమి మీద డైనోసార్‌లు కనుమరుగైనట్లే దేశంలోని రాజకీయ రంగం నుంచి పురాతన పార్టీ కనుమరుగవుతుందని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. పదేళ్ల తర్వాత ఏ పిల్లాడిని అడిగినా కాంగ్రెస్ పార్టీ ఏంటో చెబుతాడన్నారు. రాహుల్ గాంధీని పాకిస్థాన్‌లో అభిమానిస్తున్నారని ఆరోపించిన ఆయన.. గాంధీ కుటుంబానికి భారతదేశంలో రాజకీయాలు చేసే నైతిక హక్కు లేదన్నారు.

Read Also: Uttarakhand : అడవుల్లో చల్లారని మంటలు.. హిమాలయాలు కరిగే ప్రమాదం

అయితే, కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి మద్దతు ఇవ్వలేదని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. కానీ, బీజేపీ మాత్రం ఆయనకు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సత్కరించిందన్నారు. మోడీ ప్రధాని అయ్యాక భారత్ ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలిపారు. మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా దేశం అడుగులు వేస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. మోడీ నాయకత్వంలో దేశంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం నాలుగైదు గంటల పాటు ఆగిపోయిందని.. తద్వారా భారత్ తన 22,000 మంది పౌరులను ఖాళీ చేయగలిగామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు.

Read Also: IPL 2024 Orange Cap: ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ కోహ్లీకి దక్కేనా..?

గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉండేవని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. అయితే, అటల్ బిహారీ వాజ్‌పేయి లేదా మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాలపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని చెప్పారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి హామీలను బీజేపీ నెరవేర్చిందని చెప్పుకొచ్చారు.

Exit mobile version