Site icon NTV Telugu

Naizam : నైజాం డిస్ట్రిబ్యూషన్ లో అడుగుపెడుతున్న యంగ్ ప్రొడ్యూసర్

Dheeraj Mogilineni

Dheeraj Mogilineni

నైజాం మార్కెట్‌పై ఆధిపత్యం కోసం టాలీవుడ్ బడా నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఇప్పటీకే మైత్రి, దిల్ రాజు తమ హవా కొనసాగిస్తుండగా ఇటీవల అన్నపూర్ణ సంస్థ ఆఫీస్ ఓపెన్ చేసింది. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా మరో నిర్మాత నైజాంలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ తీశారు. టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ మరియు డిస్ట్రిబ్యూటర్‌గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ధీరజ్ మొగిలినేని ఇప్పుడు నైజాం మార్కెట్‌పై దృష్టి సారించారు. ఇప్పటికే ఆంధ్రా మరియు సీడెడ్ ఏరియాల్లో సొంత డిస్ట్రిబ్యూషన్ ఆఫీసుల ద్వారా పలు విజయవంతమైన చిత్రాలను పంపిణీ చేసిన ఆయన, ఇప్పుడు నైజాం ఏరియాలో కూడా తన సొంత ఆఫీసును ప్రారంభించి బిజినెస్‌ను విస్తరిస్తున్నారు.

Also Read : NBK : బాలయ్య గ్రీన్ సిగ్నల్ కోసం.. బారులు తీరిన నలుగురు స్టార్ దర్శకులు..

రీసెంట్‌గా రష్మిక మందన్నతో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ వంటి క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్న ధీరజ్, నైజాం డిస్ట్రిబ్యూషన్ ఆఫీసును కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో మొదలుపెడుతున్నారు. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌ను నైజాంలో ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్‌మెంట్స్ ద్వారా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. నైజాం ఏరియాలో ఇప్పటికే SVC, మైత్రీ మూవీ మేకర్స్, మరియు తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ వంటి దిగ్గజ సంస్థలు ఉండగా  ఇప్పుడు ధీరజ్ మొగిలినేని కూడా ఈ రేసులోకి రావడంతో నైజాం ట్రేడ్ మార్కెట్‌లో పోటీ మరింత పెరగనుంది. చిన్న మరియు మీడియం రేంజ్ సినిమాలకు థియేటర్ల కేటాయింపు విషయంలో ఈ కొత్త ఆఫీసు ఒక మంచి ప్లాట్‌ఫారమ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ధురంధర్ 2 తో జియో స్టూడియోస్ కూడా నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్ లో అడుగు పెడుతుంది.

Exit mobile version