NTV Telugu Site icon

Cyber Crime : సైబర్ మోసం.. కోటి రూపాయలు మాయం..

Cyberfraud (2)

Cyberfraud (2)

రానురాను సైబర్ నేరగాళ్లకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. జనాలను మోసం చేసేందకు వినూత్న దారులు ఎంచుకుంటూ డబ్బులు దండుకుంటున్నారు. టెక్నాలజీపై అవగాహన లేని వాళ్ల అత్యాసకు పోయి డబ్బును పోగొట్టుకుంటున్నారు. మొన్నటికిమొన్న తెలంగాణలో స్కీముల్ని ఆసరాగా చేసుకొని ఎన్నో సైబర్ మోసాలు పుట్టుకొచ్చాయి. చివరికి మైక్రోసాఫ్ట్ సర్వర్ లో తలెత్తిన సాంకేతిక సమస్యను కూడా ఆసరాగా చేసుకొని ఆన్ లైన్ మోసాలు జరిగాయి. ఇప్పుడు ఏకంగా వాట్సాప్ గ్రూపుల్లోకి కూడా ప్రవేశించింది.

Sweet corn: వానాకాలంలో స్వీట్‌కార్న్‌తో ఎన్ని లాభాలో..!

స్టాక్ మార్కెట్ మోసానికి పడి ఓ వ్యక్తి సైబర్ మోసగాళ్ల చేతిలో సుమారు రూ.కోటి మోసపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్‌చెరు పట్టణంలోని ఏపీఆర్‌ హోమ్స్‌లో నివాసం ఉంటున్న బెజవాడ నాగార్జున(36)ని నదియా కమీ అనే వ్యక్తి స్టాక్‌ మార్కెట్‌లో భారీ రాబడులు ఇస్తానని నమ్మించి మోసగించినట్లు సమాచారం. దీంతో నిందితులు ఇచ్చిన ఖాతాల్లోకి రూ.99,78,526 బదిలీ చేశాడు. మోసపోయానని గ్రహించి 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు.

TTD EO Syamala Rao: లోపాలు గుర్తించాం.. లడ్డూ ప్రసాదం నాణ్యతపై దృష్టి పెట్టాం..

ఫిర్యాదుపై సత్వరమే చర్యలు తీసుకుని నిందితుల ఖాతాల్లో రూ.24 లక్షలు స్తంభింపజేసినట్లు పటాన్‌చెరు ఇన్ స్పెక్టర్ ప్రవీణ్ రెడ్డి తెలిపారు. ఒక గంటలోపు ఫిర్యాదులను నమోదు చేయడం వల్ల నిందితుల ఖాతాల్లోని మొత్తాన్ని స్తంభింపజేయడం వల్ల వారు ప్రక్రియను అనుసరించి బాధితుల ఖాతాలకు తిరిగి రావచ్చని ఆయన అన్నారు.