Viral Video: ఓ వైపు ఎంపీ సీరియస్ గా స్పీచ్ ఇస్తుంటే.. వెనకున్న ఆరేళ్ల కుమారుడు ఏం చేస్తున్నాడో చూడండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో జరిగిన ఓ సంఘటన వైరల్ గా మారింది. ఇంటర్నెట్‌లో చాలా మంది హృదయాలను గెలుచుకుంది. ఇటీవల, US కాంగ్రెస్ సభ్యుడు, టేనస్సీ ప్రతినిధి జాన్ రోస్ సీరియస్ గా ప్రసంగిస్తున్నారు. వెనకున్న అతని 6 ఏళ్ల కుమారుడు చేసిన పనికి చాలా మంది నవ్వుకున్నారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వాస్తవానికి.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి నేరారోపణలకు వ్యతిరేకంగా రోజ్ మాట్లాడుతున్నారు.
READ MORE: Palnadu: పిన్నెల్లిని అరెస్ట్ చేస్తారన్న ప్రచారంతో పల్నాడులో టెన్షన్
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
- Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
- Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
- Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
ఎక్స్‌లో అప్‌లోడ్ చేసిన వీడియో చేసే వరకు వెనక తన కొడుకు కెమెరాకు వినోదం పంచుతున్నాడని ఆయనకు తెలియలేదు. జాన్ రోస్ స్వీచ్ ఇస్తున్నప్పుడు కుమారుడైన గైని కెమెరాను చూసి నవ్వడం ప్రారంభించాడు. ఆపై తన నాలుకను చాపడం ద్వారా వింత వంకర ముఖాలను ప్రదర్శించాడు. తన కళ్ళు తిప్పడం వీడియోలో చూడొచ్చు. చివరికి బాలుడు తన చేష్టలతో విసిగిపోయి.. మెత్తని బొమ్మతో ఆడుకోవడం ప్రారంభించాడు.
జాన్ రోస్ ఈ వీడియోను షేర్ చేశారు. “ఇది నా కొడుకు గైని తన తమ్ముడిని నవ్వించడం కోసం చేసింది ” అని క్యాప్షన్ ఉంది. ఆ పిల్లాడి ఆటతీరు చాలా మంది ముఖాల్లో చిరునవ్వు తెప్పించింది. ఈ వీడియో చూసిన తర్వాత జాన్ రోజ్ స్వయంగా నవ్వి ఉంటారు. ఈ వీడియో సోషల్ మీడియాలో త్వరగా ప్రజాదరణ పొందింది. గై అమాయకత్వంపై వినియోగదారులు చాలా ప్రేమను కురిపించారు. ఈ వీడియో 6 లక్షల 50 వేల కంటే ఎక్కువ మంది వీక్షించారు. వీక్షణల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. చాలా మంది పిల్లవాడిని చాలా క్యూట్ అని కామెంట్స్ చేశారు. అలాగే కొందరు అతని హాస్యాన్ని మెచ్చుకున్నారు.
This is what I get for telling my son Guy to smile at the camera for his little brother 🤷♂️ https://t.co/L8sLBDJt35
— Congressman John Rose (@RepJohnRose) June 3, 2024
తాజావార్తలు
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
-
Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
-
Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
-
Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!