NTV Telugu Site icon

Mahesh Babu Birthday: మొత్తానికి మహేష్ బర్త్డే ట్రీట్ రెడీ చేశారు..

Mahesh Babu

Mahesh Babu

Mahesh Babu Birthday: టాలీవుడ్ సూపర్ స్టార్ మ‌హేష్ బాబు పుట్టిన సంద‌ర్భంగా ఈ ఆగ‌స్ట్ 9న అభిమానుల‌కు చాలా స‌ర్‌ప్రైజ్లు ఉండ‌బోతున్న‌ట్లు కనపడుతోంది. ఇందులో ముఖ్యంగా మ‌హేష్‌బాబు, రాజ‌మౌళి సినిమాకు సంబంధించి ఆఫీషియ‌ల్ అనౌన్స్మెంట్ ఆగ‌స్ట్ 9న‌ రాబోతున్నట్లు సమాచారం. సినిమా లాంఛింగ్‌, షూటింగ్ వివరాలు, నటీనటులతో పాటు పలు విష‌యాల‌పై మ‌హేష్‌బాబు పుట్టినరోజున క్లారిటీ రానున్న‌ట్లు స‌మాచారం. దీనికి అదనంగా., మరో అప్డేట్‌.. మ‌హేష్ బ‌ర్త్ డే రోజున అత‌డి బ్లాక్‌ బ‌స్ట‌ర్ క్లాసికల్ సినిమా థియేట‌ర్ల‌లో రీ రిలీజ్ కానుంది. ఏకంగా 23 ఏళ్ల కిందట మ‌హేష్ బాబు హీరోగా న‌టించిన మురారి సినిమా మ‌రోసారి థియేట‌ర్ల‌లో సందడి చేయనుంది. మ‌హేష్‌బాబు పుట్టిన రోజు ఈ సినిమా స్పెష‌ల్ షోస్‌ ను తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్‌ సీస్లో కూడా స్క్రీనింగ్ చేయ‌బోతున్నారు. మురారి సినిమా రీ రిలీజ్‌ ను కాస్త భారీగానే ప్లాన్ చేస్తోన్న‌ట్లు తెలుస్తోంది. దాదాపు 300కు పైగా థియేట‌ర్ల‌లో ఈ సినిమా రీ రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం.

Low BP vs High BP: అసలు ఈ లోబీపీ, హైబీపీ మధ్య తేడా ఏంటి..

పూర్తిగా యూత్, ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన మురారి మూవీ క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద హిట్‌. ఈ సినిమా ఏకంగా 3 నంది అవార్డుల‌ను అందుకుంది. ఈ అవార్డ్స్ లో బెస్ట్ ఫిల్మ్‌ గా సిల్వ‌ర్ అవార్డుతో పాటు.. బెస్ట్ క్యారెక్ట‌ర్ యాక్ట‌ర్‌ గా ల‌క్ష్మి నంది పుర‌స్కారాన్ని అందుకున్నారు. అలాగే స్పెష‌ల్ జ్యూరీ కేట‌గిరీలో మురారి సినిమాకు మ‌హేష్‌బాబు కూడా నంది అవార్డు కైవసం చేసుకున్నాడు. సినిమాకి కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వం వహించగా., హీరో మ‌హేష్‌ బాబు సరసన సోనాలీ బింద్రే హీరోయిన్‌ గా న‌టించింది. ఈ సినిమా తోనే సోనాలీ బింద్రే టాలీవుడ్‌ లోకి అడుగు పెట్టింది. ఇకపోతే తాజాగా అనంత్ అంబానీ, రాధికా మ‌ర్చెంట్ వివాహ వేడుక‌ల్లో లాంగ్ హెయిర్ తో స్టైలిష్ లుక్‌ లో హీరో మ‌హేష్ క‌నిపించాడు. రాజ‌మౌళి సినిమాలో ఇదే లుక్‌ లో క‌నిపించ‌బోతున్న‌ట్లు టాక్.

Raj tarun : మాల్వీ మల్హోత్రా నిజస్వరూపం బయటపెట్టే మరోక వీడియో…ఇంతకీ ఆ వీడియోలో ఏముంది..?

Show comments