NTV Telugu Site icon

UP: ఘోరం.. బ్యాంక్ డ్యూటీలో ఉండగా గుండెపోటు.. సీట్లోనే కుప్పకూలిన మేనేజర్

Bank 2

Bank 2

మృత్యువు ఎప్పుడు.. ఎలా.. ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ ఈ మధ్య జరుగుతున్న మరణాలు అంతు చిక్కడం లేదు. ఒకప్పుడు గుండెపోటు అంటే.. వయసు పైబడిన వారికి వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు.. ఇలా ఏ వయసు తేడా లేకుండా.. అన్ని వయసుల వారికి హార్ట్ ఎటాక్‌లు రావడం దిగ్భ్రాంతి కరమైన పరిణామం. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ బ్యాంక్‌లో పని చేస్తున్న యువ ఉద్యోగికి హార్ట్ ఎటాక్ వచ్చి కుర్చీలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ పరిణామంతో సహా ఉద్యోగులంతా షాక్‌కు గురయ్యారు. ఈ ఘోరం ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్రాంచ్‌లో జరిగింది.

ఇది కూడా చదవండి: KCR: తొందర పడకండి.. ఎమ్మెల్యేలతో కేసీఆర్ కీలక భేటీ..!

హెచ్‌డీఎఫ్‌సీ బ్రాంచ్‌లో జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ షిండే (30) ల్యాప్‌ట్యాప్‌లో పని చేస్తున్నాడు. సడన్‌గా కుర్చీపై నుంచి కిందకి కుప్పకూలిపోయాడు. సహచర ఉద్యోగులంతా అప్రమత్తమై ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బ్యాంక్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అధిక ఒత్తిడి కారణంగానే గుండెపోటులు వస్తున్నాయని వైద్యులు పేర్కొన్నారు. ఈ పరిణామంతో ఉద్యోగులంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అప్పటిదాకా కళ్ల ముందు మెదిలాడిన వ్యక్తి.. ఆ క్షణంలోనే చనిపోవడం చూసి ఉద్యోగులంతా నిశ్చేష్టులయ్యారు.

ఇది కూడా చదవండి: Kalki 2898 AD: తుఫాన్ కాదిది సునామీ.. రిలీజ్ కు ముందే 14 లక్షల టిక్కెట్ల అమ్మకం!