Snow Tsunami:జపాన్‌లో సునామీ విపత్తు సంభవించి సరిగ్గా 11 ఏండ్లు పూర్తయ్యాయి. సునామీ సృష్టించిన విధ్వంసంలో దాదాపు 15 వేల మంది మరణించగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రాకాసి అలలు జపాన్‌ను ముంచెత్తడంతో ఇండ్లు, వాహనాలు కాగితపు పడవలుగా మారి కొట్టుకుపోయాయి. దాదాపు పది రోజులపాటు జపాన్ ప్రజలు తినడానికి సరైన తిండి లేక, తాగేందుకు నీరు లేక అల్లాడిపోయారు. జపాన్ తూర్పు ద్వీపకల్పంలోని ఓషికాకు 70 కిలోమీటర్ల దూరంలో 2011 లో సరిగ్గా ఇదే రోజున రిక్టర్ స్కేలుపై 9 తీవ్రతతో భూకంపం సంభవించింది. జాతీయ పోలీసు ఏజెన్సీ ప్రకారం, దాదాపు 2,000 మందికి పైగా గల్లంతయ్యారు. ఇది జపాన్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యంత శక్తివంతమైన భూకంపాలలో ఒకటిగా నిలిచింది.
Read Also: Drugs Seized : మాత్రల రూపంలో రూ.కోట్లు విలువ చేసే డ్రగ్స్.. సీజ్ చేసిన అధికారులు
సేమ్ అలాగే జమ్మూకశ్మీర్ లోని ప్రముఖ హిల్ స్టేషన్ సోనామార్గ్ ను అవలాంచి ముంచెత్తింది. సునామీలా మంచు ముంచెత్తింది.రెండు వైపుల నుంచి భారీగా మంచు దూసుకొస్తుంటే జోజిలా టన్నెల్ పనుల్లో ఉన్న కార్మికులు భయాందోళనతో పరుగులు తీశారు.తమ బ్యారక్ లలోకి వెళ్లి తలదాచుకున్నారు.ఈ భయంకర అనుభవాన్ని జోజిలా టన్నెల్ పనులు చేస్తున్న కన్ స్ట్రక్షన్ కంపెనీ జనరల్ మేనేజర్ హర్ పాల్ సింగ్ తన కెమెరాలో బంధించారు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, ఈ ఘటనలో కార్మికులు ఎవరికీ ఏమీ కాలేదని హర్ పాల్ వివరించారు.
src=hash&ref_src=twsrc%5Etfw”>#Police and #SDRF are on the spot.#IADN pic.twitter.com/NgLuwPuORa
— Indian Aerospace Defence News (IADN) (@NewsIADN) January 15, 2023