Gun Fire: ఆటలో ఓడిపోయినందుకు తనను చూసి నవ్వారని.. ఏడుగురిని చంపేశాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Kills 7 After Being Laughed At For Losing At Pool: బ్రెజిల్‌లో ఘోరం జరిగింది. ఆటలో ఓటమి పాలైన తనను చూసి నవ్వారని ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఏడుగురిని చంపేశాడు. 12 ఏళ్ల బాలికతో సహా ఏడుగురు వ్యక్తులు తనను చూసి నవ్వారని వారిని కాల్చి హత్య చేశాడు. ఈ సంఘటన బ్రెజిల్‌లోని మాటో గ్రాసోలోని సినోప్ సిటీలో మంగళవారం జరిగింది. మాటో గ్రోసో రాష్ట్రంలోని సినోప్ నగరానికి చెందిన ఎడ్గర్ రికార్డో డి ఒలివిరా గత మంగళవారం స్థానిక పూల్ హాల్‌కు వెళ్లాడు. అక్కడ ఓ వ్యక్తితో 4000 రియాస్‌కు పందెం కాసి పూల్ గేమ్‌లో ఓటమి పాలయ్యాడు. దీంతో అసహనానికి గురైన ఒలివిరా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొంతసేపటికి తన స్నేహితుడు ఎజిక్వియాస్ సౌజా రెబిరోతో అక్కడికి వచ్చిన ఒలివిరా.. మళ్లీ అదే వ్యక్తితో పందెం కాశారు. రెండోసారి కూడా అతడు ఓడిపోవడంతో పూల్ హాల్‌లో ఉన్న కొందరు అతడిని చూసి నవ్వారు.
Read Also: Suicide Attempt: ఎఫైర్‌ను బయటపెడుతారన్న భయంతో ఉరేసుకున్న యువకుడు
Also Read
రెండోసారి కూడా ఓడిపోవడంతో అక్కడి వ్యక్తులు నవ్వగా.. ఇది ఒలివిరాకు కోపం తెప్పించింది. అతను పికప్ ట్రక్ నుంచి షాట్‌గన్‌ని తీసుకున్నాడు. అయితే ఎజెక్వియాస్ పిస్టల్‌ను వినియోగించి అందరినీ లైన్‌లో నిలబెట్టాడు. ఒలివిరా పూల్ యజమానితో పాటు ఇతర వ్యక్తులను కాల్చి చంపాడు. వారిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఏడవ బాధితుడు మొదట్లో ప్రాణాలతో బయటపడ్డాడు కానీ ఆ తర్వాత ఆసుపత్రిలో మరణించాడు. పోలీసులు బాధితుల పేర్లను విడుదల చేశారు. లారిస్సా ఫ్రసావో డి అల్మెయిడా, ఒరిస్బెర్టో పెరీరా సౌసా, అడ్రియానో బాల్బినోట్, గెటులియో రోడ్రిగ్స్ ఫ్రసావో జూనియర్, జోస్యు రామోస్ టెనోరియో, పూల్ హాల్ యజమాని మసీల్ బ్రూనో డి ఆండ్రేడ్ కోస్టా మృతి చెందినట్లు తెలిపారు. ఏడవ బాధితుడు ఎలిజ్యూ శాంటోస్ డా సిల్వా ఆస్పత్రిలో చనిపోయినట్లు తెలిపారు. ఈ ఘటన అంతా పూల్ హాల్‌లోని సీసీటీవీలో రికార్డైంది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వారిద్దరిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!