NTV Telugu Site icon

Kejriwal: ఉగాది రోజున బెయిల్ పిటిషన్ విచారణ.. సర్వత్రా ఉత్కంఠ

Ke

Ke

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై ఉగాది రోజున హైకోర్టు విచారించనుంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ మధ్యాహ్నం 2.30 గంటలకు కేసును విచారించనున్నారు. ఏప్రిల్ 3న ఈడీ.. కేజ్రీవాల్ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఈ కేసులో తన నిర్ణయాన్ని రిజర్వ్ చేశారు.

ఇది కూడా చదవండి: Fake Whatsapp: ఎస్పీడీసీఎల్ సీఎండీ ముష్రాఫ్ అలీ పేరుతో నకిలీ వాట్సాప్

కేజ్రీవాల్ బెయిల్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేజ్రీవాల్‌కు బెయిల్ వస్తుందని ఆప్ నేతలు భావిస్తున్నారు. ఇదే కేసులో ఇటీవల ఆప్ నేత సంజయ్‌సింగ్‌కు బెయిల్ లభించింది. ఆరు నెలల్లోనే ఆయనకు బెయిల్ వచ్చింది. ఇప్పుడు కేజ్రీవాల్‌కు కూడా బెయిల్ వస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆశిస్తున్నారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇది కూడా చదవండి: Astrology: ఏప్రిల్‌ 9, మంగళవారం దినఫలాలు

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 21న ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను ఈడీ కస్టడీకి ఇచ్చింది. ఇక ఏప్రిల్ 1న రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. జైలు నుంచే పరిపాలనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ రాజీనామా చేయాల్సి వస్తే.. ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకోవైపు దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీని ముందుండి నడిపించే నాయకుడి లేడు. దీంతో కేజ్రీవాల్‌కు బెయిల్ రావాలని ఆప్ నేతలు కోరుకుంటున్నారు. మరీ హైకోర్టు ఏం తీర్పు ఇవ్వనుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

ఇది కూడా చదవండి: Rahul Gandhi: అమేథీలో పోటీపై క్లారిటీ వచ్చేది అప్పుడే..!