NTV Telugu Site icon

Oman Vs Australia: బోణి కొట్టిన ఆసీస్.. ఒమన్ పై భారీ విజయం..

Aust

Aust

2024 టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా తన మొదటి మ్యాచ్ ను గెలిచింది. గురువారం ఒమన్‌తో బార్బడోస్ లో జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో ఆసీస్ 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. మార్కస్ స్టోయినిస్ (67 నాటౌట్; 36 బంతుల్లో) అలాగే బౌలింగ్ లో (3-0-19-3) విధ్వంసక నాక్ తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేసింది. దాంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (56; 51 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), స్టోయినిస్ అర్ధశతకం సాధించారు. మెహ్రాన్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు. అయితే ఆసీస్ మొదట చాలా నెమ్మదిగా స్కోర్ ను సాధించారు. 12 ఓవర్లలో 63/3 మాత్రమే చేసింది. ఆ తర్వాత స్టోయినిస్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బౌండరీలు, సిక్సర్లతో రెచ్చిపోయాడు.

Modi – Akira Nandan: అకిరా నందన్ ను మోడీకి పరిచయం చేసిన పవన్!

మెహ్రాన్ ఖాన్ వేసిన 15వ ఓవర్లో నాలుగు సిక్సర్లతో 26 పరుగులు చేశాడు. అతను తన అర్ధ సెంచరీ 27 బంతులతో చేశాడు. మరోవైపు వార్నర్ జాగ్రత్తగా ఆడుతూ అతనికి మద్దతుగా నిలిచాడు. అతను తన అర్ధ సెంచరీని 46 బాల్స్ లో చేశాడు. స్టోయినిస్ వార్నర్ నాలుగో వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి కారణంగానే ఆసీస్ చివరి 8 ఓవర్లలో 101 పరుగులు చేసింది.

JC Prabhakar Reddy :మున్సిపల్ చైర్మన్ పదవికి మాజీ ఎమ్మెల్యే రాజీనామా..!

అనంతరం ఒమన్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 129 పరుగులు మాత్రమే చేసింది. అయాన్ ఖాన్ (36; 30 బాల్స్) టాప్ స్కోరర్. స్టోయినిస్‌కు మూడు వికెట్లు దక్కాయి. స్టార్క్, ఎల్లిస్, జంపా చెరో రెండు వికెట్లు తీశారు. ఒమాన్ ఆరంభం నుంచే ఒకదాని తర్వాత ఒకటి వికెట్లు కోల్పోయింది. ఒక దశలో 57 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో మెహ్రాన్ ఖాన్ (27; 16 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) కొట్టడంతో ఓటమిని కాస్త తగ్గించాడు.