Strange: దేవుడు సృష్టించిన ఈ భూమ్మీద ఎన్నో వింతలు విశేషాలున్నాయి. శాస్త్రవేత్తలు వారి పరిశోధనల్లో రోజుకో వింతను కనుగొంటూనే ఉన్నారు. అయినప్పటికీ ప్రకృతిలో ఇప్పటివరకు తెలియని రహస్యాలు ఇంకా కోకొల్లలు దాగున్నాయనడానికి ఈ వార్తే సాక్ష్యం. సాధారణంగా కొన్ని జంతువులు కంటికి కనిపిస్తుంటాయి. మరి కొన్నింటిని టెలిస్కోపుల వంటి పరికరాలతో చూస్తుంటాం. బయటి ప్రపంచంలో కొన్ని రంగులు మార్చే జంతువులను చూస్తుంటాం. సముద్రంలో కొన్ని వేల రకాల జలచరాలు జీవిస్తుంటాయి. కొన్ని ఈ ప్రపంచం బయటికి కనిపిస్తాయి. అలాంటి సముద్ర జీవికి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. దీని లుక్ ఇంటర్నెట్‌ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ జీవి యొక్క వీడియోను మాసిమో అనే వినియోగదారు ట్విట్టర్‌లో పంచుకున్నారు. దీనిపేరు సిస్టిసోమా. ఇది సముద్రంలో 600-1000 మీటర్ల లోతులో నివసించే క్రస్టేసియన్(ఆర్థోపొడా జాతికి చెందిన జీవి). దాని శరీరం పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. దాని కళ్ళు మాత్రమే వర్ణద్రవ్యం కలిగి ఉంటాయి. దాని గుడ్లు నారింజరంగులో ఉంటాయి.
Read Also : Shopping Mall Tragedy : న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 9మంది మృతి
సిస్టిసోమా అంతర్గత అవయవాల కణజాలాలు చాలా నిర్మాణాత్మకంగా, క్రమబద్ధంగా నిర్వహించబడతాయి, వాటిలో ఎక్కువ భాగం క్రిస్టల్ పారదర్శకంగా కనిపిస్తాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసినప్పటి నుండి 12 మిలియన్ల మంది వీక్షించారు. 11 వేలకు పైగా లైకులు వచ్చాయి. వీడియోలో జలచరాన్ని చూసిన వారంతా తమదైన రీతిలో కామెంట్లు చేస్తున్నారు. సిస్టిసోమా శరీరంలో తల చాలా పెద్దగా ఉంటుంది. రాత్రి పూట చూసేందుకు ఇది ఉపయోగకారిగా ఉంటుంది. దీనిపై వాషింగ్టన్ లోని స్మిత్‌సోనియన్ ఇన్‌స్టిట్యూషన్‌లో పరిశోధనలు జరుపుతున్నారు.
Cystisoma is a crustacean that lives between 600-1000 m deep in the ocean. Its body is totally transparent: only its eyes are pigmented. This one has a brooding pouch full of orange eggs
[read first: https://t.co/d4jiqKNbeb
[📹 Alejandro Damian-Serrano]pic.twitter.com/6xJkNHqoPj— Massimo (@Rainmaker1973) December 29, 2022