NTV Telugu Site icon

OLA: ఇ-కామర్స్ రంగంలోకి ఓలా..

Ola

Ola

OLA in E-commerce: ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేసి క్యాబ్ సేవలను అందిస్తున్న ఓలా సంస్థ ఈ-కామర్స్ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. అందిన సమాచారం ప్రకారం., ఓలా కంపనీ బ్లింకిట్, జెప్టోలను తీసిపోయే విధంగా.. ఈ వారం తర్వాత వాణిజ్య రంగంలోకి ప్రవేశాన్ని ప్రకటించవచ్చు. త్వరిత డెలివరీ సేవలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఓలా మాతృ సంస్థ ANI టెక్నాలజీస్ తన సొంత డార్క్ స్టోర్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోందని సమాచారం.

Neeraj Chopra: పతకాలను సంఖ్యను పోల్చడం ఏమత్రం సరికాదు: నీరజ్‌

డార్క్ దుకాణాలు చిన్న రిటైల్ గిడ్డంగులులలో వస్తువులు వేగంగా డెలివరీ చేయడానికి నిల్వ చేయబడతాయి. ఓలా ఈ డార్క్ స్టోర్లను నిర్వహిస్తుంది. ఇక ఇందుకోసం రోబోలను వాడబోతోంది. నివేదిక ప్రకారం, డార్క్ స్టోర్‌తో పాటు, ఓలా తన వినియోగదారుల కోసం దాని స్వంత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ ( UPI )ని కూడా ప్రారంభించాలని యోచిస్తోంది. ఆగస్టు 15న జరిగే కంపెనీ వార్షిక స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) భవిష్ అగర్వాల్ ఈ విషయాన్ని ప్రకటిస్తారు.

Owaisi: బీజేపీ ముస్లింలకు శత్రువు..దానికి ఈ బిల్లు నిదర్శనం..ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

ఇ-కామర్స్ రంగంలో బ్లింక్‌కిట్, జెప్టో వంటి కంపెనీల నుండి ఓలా పోటీని ఎదుర్కొంటుంది. జొమాటో యాజమాన్యంలోని ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ బ్లింక్‌కిట్ 2026 చివరి నాటికి మొత్తం 2,000 డార్క్ స్టోర్‌ లను ప్రారంభించాలని యోచిస్తోంది. అదేవిధంగా, జెప్టో మార్చి 2025 నాటికి మొత్తం డార్క్ స్టోర్‌ల సంఖ్యను 700కి రెట్టింపు చేస్తుంది. స్విగ్గి ఇన్‌స్టామార్ట్ కూడా దేశవ్యాప్తంగా కొత్త డార్క్ స్టోర్‌ల కోసం వెతుకుతోంది.

Show comments