ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇదే మంచి సమయం. ఎలక్ట్రిక్ స్కూటర్లు, మోటార్ సైకిళ్లను తయారు చేసే దేశీయ సంస్థ అయిన ఓలా ఎలక్ట్రిక్, ఓలా సెలబ్రేట్స్ ఇండియా అనే గొప్ప పండుగ ఆఫర్‌ను ప్రారంభించింది. దీని కింద ఎలక్ట్రిక్ వాహనాల ప్రారంభ ధర రూ. 49,999 గా నిర్ణయించింది. ఈ ఆఫర్ ముహూర్త మహోత్సవ్ పేరుతో ప్రారంభించింది. ఇది రాబోయే తొమ్మిది రోజుల పాటు కొనసాగుతుంది. ఈ స్కూటర్లు, మోటార్ సైకిళ్ళు రూ. 49,999 కు లభిస్తాయి. ఈ ఆఫర్ కింద, 2 kWh మోడల్ Ola S1X ను కేవలం రూ. 49,999 కు కొనుగోలు చేయవచ్చు (మొదటి ధర రూ. 81,999). అదనంగా, 2.5 kWh వేరియంట్ Ola Roadster X ను కేవలం రూ. 49,999 కు (మొదటి ధర రూ. 99,999) కొనుగోలు చేయవచ్చు.
Also Read:Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ ‘‘దేశద్రోహి’’.. గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారా సంచలన వ్యాఖ్యలు..
మరింత శక్తివంతమైన మోడళ్ల కోసం చూస్తున్న వారికి, ఓలా S1 ప్రో+ (5.2 kWh), రోడ్‌స్టర్ X+ (9.1 kWh) ఇప్పుడు రూ. 99,999 ధరకు లభిస్తున్నాయి. రెండూ టాప్-స్పెక్ మోడల్స్, వీటిలో 4680 భారత్ సెల్ బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. వాటి అసలు ధర వరుసగా రూ. 1,69,999, రూ. 1,89,999. S1 Pro+, S1 Pro – ఇవి 3 kWh నుండి 5.2 kWh వరకు బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. రూ. 1.20 లక్షల నుండి రూ. 1.69 లక్షల మధ్య ధర కలిగి ఉంటాయి. S1 X – ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సామాన్యులను లక్ష్యంగా చేసుకుని రూ. 81,999 నుండి ప్రారంభమవుతుంది. పాత మోడల్స్ – రెండవ తరం పాత మోడల్స్ ఇప్పటికీ రూ. 97,999, రూ. 1,18,999 కు అందుబాటులో ఉన్నాయి. రోడ్‌స్టర్ X+ 4.5 kWh బ్యాటరీని కలిగి ఉంది. దీని ధర రూ. 1,27,499. రోడ్‌స్టర్ X 2.5 kWh, 3.5 kWh, 4.5 kWh ఆప్షన్లలో వస్తుంది. దీని ధర రూ. 99,999 రూ. 1,24,999 మధ్య ఉంటుంది.
Also Read:Maruti Suzuki sales: జీఎస్టీ ఎఫెక్ట్.. నవరాత్రి మొదటి రోజే 25 వేల కార్లు విక్రయించిన మారుతి..
ఓలా స్పోర్ట్స్ స్కూటర్ విభాగంలోకి కూడా ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. S1 Pro స్పోర్ట్ అని పిలువబడే ఈ స్కూటర్ జనవరి 2026లో రూ. 1.49 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ అవుతుంది. ఈ పండుగ సీజన్‌లో కస్టమర్లను ఆకర్షించడానికి ఓలా ఎలక్ట్రిక్ అనేక ఆకర్షణీయమైన తగ్గింపులు, ప్రయోజనాలను అందిస్తోంది.