Okaya EV Scooters Offers: ఒకయా ఈవీ స్కూటర్లపై భారీ తగ్గింపు.. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Okaya EV Offers in Monsoon Cashback Scheme: ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ‘ఒకాయా’ గ్రూప్.. తన రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. కంపెనీ రెండేళ్ల వార్షికోత్సవం సందర్భంగా ఆఫర్ ప్రకటించింది. జూలై 31 వరకు కంపెనీ అందిస్తున్న మాన్‌సూన్ క్యాష్‌బ్యాక్ స్కీమ్‌తో కలిపి ఈ తగ్గింపులు ఉంటాయి. భారత ప్రభుత్వం ఎఫ్ఏఎంఈ-II సబ్సిడీల్లో తగ్గింపును ప్రకటించిన తర్వాత.. ఈవీ స్కూటర్ల ధరలు పెరిగాయి. సబ్సిడీల తగ్గింపు తర్వాత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సేల్స్ కాస్త తగ్గాయి. దాంతో తమ సేల్స్‌ను నిలబెట్టుకునేందుకు ‘ఒకాయా’ ఈ ఆఫర్లను ప్రకటించింది.
ఎంట్రీ లెవల్ ఒకాయా క్లాస్ ఐక్యూ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ. 74,999 (ఎక్స్-షోరూమ్) కంటే తక్కువగా అందుబాటులో ఉంది. ఒకాయా ఫాస్ట్ ఎఫ్2టీ, ఎఫ్2బీ ఎలక్ట్రిక్ స్కూటర్లు రూ. 1 లక్షలోపే అందుబాటులో ఉన్నాయి. ఒకాయా ఫాస్ట్ ఎఫ్1టీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 99,950కి కొనుగోలు చేయవచ్చు. ఈ స్కూటర్‌పై రూ. 10,800 తగ్గింపు ఉంది. అదే సమయంలో ఒకాయ ఫాస్ట్ ఎఫ్2బీ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ. 8,500 తగ్గింపు ఉండగా.. రూ. 99,400కి అందుబాటులో ఉంది.
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
ఒకాయా కంపెనీ జూలై 31 వరకు మాన్‌సూన్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లను కూడా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఒకాయా ఫాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే కస్టమర్‌లు రూ. 5000 వరకు విలువైన క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అంతేకాదు రూ. 50000 విలువైన థాయిలాండ్ ట్రిప్‌ను (నాలుగు రోజుల ట్రిప్) కూడా గెలుచుకునే అవకాశం ఉంది. ఫాస్ట్ ఎఫ్4, ఫాస్ట్ ఎఫ్3, ఎఫ్2బీ, ఎఫ్2టీ ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోలుపై ఈ ఆఫర్స్ ఉన్నాయి. మరోవైపు ప్రతి కొనుగోలుపై రూ. 500 నుంచి రూ. 5000 వరకూ క్యాష్‌బ్యాక్ వస్తాయి.
Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన పసిడి ధరలు! తులం ఎంతంటే?
Also Read: West Bengal: ఉద్రిక్తతల మధ్య నేడు బెంగాల్ పంచాయతీ ఎన్నికలు..
తాజావార్తలు
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి