హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ ఎన్ ఎండీసీ వద్ద ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఆయిల్ ట్యాంకర్ రోడ్డుపై బోల్తా పడటంతో పెద్ద సంఖ్యలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో.. మాసబ్ ట్యాంక్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ నిలచిపోయింది. ఆయిల్ ట్యాంకర్ పడిపోవడంతో ఇరువైపుల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. గంటల తరబడి ట్రాఫిక్‌లో నిలిచిపోయాయి వాహనాలు. రోడ్డుపై ఆయిల్ మొత్తాన్ని తొలగించారు అధికారులు.
Also Read : Expensive Cities: అత్యంత ఖరీదైన నగరంగా న్యూయార్క్ .. టాప్-5లో సింగపూర్
అయితే.. మాసబ్‌ట్యాంక్, మోహదీపట్నం, పీవీ ఎక్స్‌ప్రెస్, బంజారాహిల్స్ రోడ్‌నెం.1, లక్డీకాపూల్, ఖైరతాబాద్‌లో ట్రాఫిక్. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. రోడ్డుపై ఆయిల్ ఉండటంతో వాహనదారులు జారిపడుతున్నారు. మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ నుంచి కిందికి ఆయిల్ కారుతుండటంతో.. మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ కిందా పైన ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
Also Read : Plastic: ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్-టిఫిన్స్ బాక్స్ లు వాడుతున్నారా.. అయితే మీ ఆరోగ్యం క్షీణించినట్లే..!
