Pawan Kalyan’s OG Movie Update: టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి ‘ఓజీ’. రన్ రాజా రన్, సాహో చిత్రాల ఫేం సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రియాంకా మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఓజీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. యాక్షన్ జోనర్‌లో 1990 నాటి బ్యాగ్‌డ్రాప్‌తో వస్తున్న ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఓజీ సినిమాను సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.
ఓజీ కథ విషయంలో క్రేజీ అప్‌డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాఫియా డాన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే కథ రీత్యా మాఫియా డాన్ అయిన పవన్.. కొన్ని కారణాలవల్ల పదేళ్ల పాటు మాఫియాకు దూరంగా ఉంటాడట. 10 ఏళ్ల తర్వాత మాఫియాకు వ్యతిరేకంగా బరిలోకి దిగి.. శత్రుమూకను అంతం చేస్తాడట. ఇదే ఈ సినిమా ప్రధాన స్టోరీ అని నెట్టింట టాక్ వినిపిస్తోంది. మరి అందులో నిజం ఎంతుందో తెలియాలంటే సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే.
Also Read: IND vs ENG: మా బౌలర్లకు ఒకటే చెప్పా: రోహిత్ శర్మ
ఇప్పటికే ఓజీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, షాన్ కక్కర్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్‌ఘోష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఎస్ఎస్ తమన్ స్వరాలు అందిస్తున్నారు.