Site icon NTV Telugu

Pawan Kalyan-OG: ఇక డీజే కాదు.. ‘ఓజీ’ మోతనే!

Pawan Kalyan Og

Pawan Kalyan Og

సెప్టెంబరు 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజుని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడానికి అభిమానులు రెడీ అవుతున్నారు. ఈ సారి పవన్ బర్త్ డే ఫ్యాన్స్‌కు చాలా స్పెషల్ కానుంది. ఎమ్మెల్యేగా గెలిచాక ఇది పవన్‌కు మొదటి పుట్టినరోజు. అంతేకాక పవర్ స్టార్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. దీంతో పవన్ బర్త్ డేను ఓ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు అయన ఫాన్స్. మరోవైపు పవన్ సిమిమాలకు సంబంధించి మూడు సినిమాల పోస్టర్‌లు రానున్నట్టు తెలుస్తోంది.

హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్‌తో పాటు ఓజీ (ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌) నుంచి అప్డేట్స్ రానున్నాయి. అయితే ఓజీ నుంచి స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. ముందు నుంచి టీజర్ రిలీజ్ చేస్తారని టాక్ వినిపించింది. ఇప్పటికే అంతకు మించి అనేలా ఓజీ టీజర్‌ని దర్శకుడు సుజీత్ కట్ చేస్తున్నాడని అన్నారు. కానీ ఇప్పుడు ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానున్నట్లుగా తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ఇటీవల అదిరిపోయే పోస్ట్ ఒకటి షేర్ చేశాడు. ‘సిల్వర్ స్క్రీన్ పై తుఫాన్‌కి ముందు ప్రశాంతంగా ఉండండి.. త్వరలో కలుద్దాం’ అని పేర్కొన్నాడు. దీంతో పవర్ స్టార్ బర్త్ డేకి ఓజీ నుంచి ఫస్ట్ సాంగ్ బయటికి రావడం పక్కా అని అంటున్నారు.

Also Read: Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ లాక్!

అదే జరిగితే సోషల్ మీడియా తగలబడిపోతుంది. పవన్ కళ్యాణ్ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో డీజే మోత కాదు.. ఓజీ మోత మోగనుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏదేమైనా ఓజీ నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే సోషల్ మీడియా షేక్ అవడం మాత్రం గ్యారెంటీ. అలా ఉంటది మరో పవన్ కల్యాణ్‌తో. గత అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి భారీ మెజారితో గెలిచిన పవన్.. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సినిమాలకు విరామం ఇచ్చిన పవర్ స్టార్.. ప్రజా సేవలో మునిగిపోయారు.

Exit mobile version