NTV Telugu Site icon

MP CM RAMESH: “రుషికొండ విషయంలో కోర్టులకు తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన అధికారులపై చర్యలు తప్పవు”

New Project (5)

New Project (5)

రుషికొండ విషయంలో కోర్టులకు తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని పార్లమెంటు దృష్టికి తీసుకెళ్తనన్నారు. ముఖ్యమంత్రితో చర్చించి బాధ్యులపై చర్యలు ఖచ్చితంగా ఉంటాయని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. బయట నుంచి వచ్చిన రెడ్లు ఉత్తరాంధ్రలో దందాలు చేశారని భారీగా భూ దోపిడీ జరిగిందన్నారు. దోపిడీకి గురైన భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని తెలిపారు. గత ప్రభుత్వంలో ఉత్తరాంధ్రలో జరిగిన భూ దోపిడీకి అధికార్లు సహకరించడం బాధాకరమన్నారు.

READ MORE: Haryana: జిమ్ ట్రైనర్‌తో ఎఫైర్.. ప్లాన్ బీతో భర్తను ఎలా మాయం చేసిందంటే..!

ఐపీఎస్, ఐఏఎస్ అధికారులపై చర్యలు తప్పవన్నారు. ఇప్పటికే ఒక అధికారి పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అద్దాల మేడలో ఉండి జగన్ కన్న కలలు చెదిరిపోయాయన్నారు. పేదలకు సెంటు భూమి జగన్ కు రుషికొండ ప్యాలే సా అని ప్రశ్నించారు. ఢిల్లీలో ఏపీ భవన్ అభివృద్ధి చేయలేదు కానీ జగన్ కోసం రుషికొండలో ఖరీదైన ప్యాలస్ అవసరమా అన్నారు. ఉత్తరాంధ్రలో బీజెపీ బలోపేతం కోసం కృషి చేస్తానని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఇప్పటి నుంచి దృష్టి పెట్టీ పనిచెయ్యాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విశాఖలో అద్భుతమైన శాశ్వత కార్యాలయం నిర్మిస్తామని తెలిపారు.

READ MORE: Pavitra Gowda: పవిత్ర గౌడకి తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన హాస్పిటిల్ కి తరలింపు!

ఇటీవల కూడా సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నుంచి వచ్చే వారిని తీసుకోవడానికి ఎన్డీఏ కూటమి డంపింగ్ యార్డ్ కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లు రాష్ట్రాన్ని నష్టపరిచి దాకోవడానికి, దాచుకోవడానికి వచ్చేవారిని కూటమిలో చేర్చుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై కూటమి కుటుంబ సభ్యులు అపోహలు నమ్మొద్దని అన్నారు. ఐదేళ్ల వైసీపీ అరాచక పాలనలో రాష్ట్రం ఎంతగానో నష్టపోయిందని చెప్పారు. ఐదేళ్లలో దందాలు చేసిన ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

Show comments