Suriya46 : సూర్య – వెంకీ అట్లూరి సినిమా టైటిల్ ను ప్రకటించిన మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మరియు టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో వస్తున్న ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘సూర్య 46’గా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ను కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ‘విశ్వనాథ్ అండ్ సన్స్‘ అనే క్లాసిక్ టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ అఫీషియల్ గా ఖరారు చేసింది. ఈ ఉదయం విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్టర్లో సూర్య ఒక చిన్న బాబును ఎత్తుకుని పాల డబ్బాతో క్లాస్‌గా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
Also Read : Toxic : ‘టాక్సిక్’ కోసం రవి బస్రూర్ మ్యూజికల్ మ్యాజిక్..
Also Read
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
- Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్‌పింగ్‌ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
ఈ చిత్రం కేవలం టైటిల్‌తోనే కాకుండా రిలీజ్ ను ఫిక్స్ చేసారు మేకర్స్. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ఈ ఏడాది జూలైలో విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. వేసవి తర్వాత రాబోతున్న ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సూర్య తన సత్తా చాటడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ‘లక్కీ భాస్కర్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మలయాళ సెన్సేషన్ మమితా బైజు కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ రవీనా టాండన్, సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఒక మధ్యవయస్కుడికి మరియు ఒక యువతికి మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
తాజావార్తలు
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!