ఆ పార్టీ నేతలు…పైకి మాత్రం మేమంతా ఐక్యంగా ఉన్నామని చెప్పుకుంటారు. లోపల మాత్రం ఎవరికీ వారే…యమునా తీరే. ఒకరి రిస్క్‌లోకి ఇంకొకరు రారు…వైరి పక్షం నుంచి విమర్శలు వచ్చినా…అసలు పట్టించుకోరు. అరోపణలను తిప్పికొట్టడానికి ప్రయత్నించరు. విమర్శలు ఎదుర్కొన్న నేతలే…చివరికి కౌంటర్ ఇచ్చుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది ? రాజకీయాల్లో పార్టీలు, నేతల మధ్య విమర్శలు, ఆరోపణలు కామన్. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం…పాలిటిక్స్‌లో నిత్యం జరిగేదే. పార్టీలపై ప్రత్యర్థులు ఏవైనా ఆరోపణలు, విమర్శలు చేస్తే…వాటిని ఇంకో పార్టీ తిప్పి కొడుతుంది. ఒక నేత ఏదైనా కామెంట్ చేస్తే…ఇంకో పార్టీ నేత దానికి కౌంటర్ ఇస్తారు. విమర్శలు, ప్రతి విమర్శలు రెగ్యులర్‌గా నడిచేవే. ఒక పార్టీలోని నేతను ఇంకో పార్టీ నేత విమర్శిస్తే .. ఆ పార్టీలోని మిగతా నేతలు కౌంటర్ ఇస్తారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతకు మూకుమ్మడిగా సపోర్ట్‌గా వస్తారు. తమ నేత మాట్లాడింది కరెక్ట్ అని ఎదురు దాడికి దిగుతారు. కానీ కాషాయ పార్టీలో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. విచిత్రమైన సిట్యువేషన్ ఉందట. ఎవరైనా ఏదైనా మాట్లాడితే…దానికి వైరి పక్షాల నుంచి విమర్శలు వస్తే…బీజేపీలో మరో నేత స్పందించడం లేదు. తమ పార్టీ నుంచి మాట్లాడిన నేతకు మద్దతుగా నిలవడం లేదని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఆ పార్టీలో బడా నేతల మధ్య ఉండాల్సినంత ఎఫెక్షన్…అంతగా లేదని పార్టీ నేతలు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌ను…బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బండిపై కేటీఆర్ సీరియస్ కామెంట్స్ చేస్తే…బీజేపీ నుంచి ఎవరు కౌంటర్ ఇవ్వలేదట. చివరికి బండి సంజయే…కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. పార్టీ నుంచి పెద్ద నేతలు ఎవరు రియాక్ట్ కాలేదట. మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను టార్గెట్ చేస్తూ…సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
రేవంత్‌రెడ్డికి కౌంటర్ ఇచ్చేందుకు మరో నేత ప్రయత్నించలేదు. ఒక్క నేత కూడా ఈటల రాజేందర్‌కు సపోర్ట్‌గా మాట్లాడపోవడంపై పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. చివరికి ఆయనే ఒక్కడే…రేవంత్‌రెడ్డికి కౌంటర్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని…కాంగ్రెస్ నేతలు, మంత్రులు, BRS నేతలు విమర్శిస్తున్నారు. తెలంగాణకు తెచ్చింది ఏంటని ప్రశ్నిస్తున్నారు. కిషన్ రెడ్డికి మద్దతుగా…ఎమ్మెల్యేలు, ఎంపీలు స్పందించడానికి వెనుకడుగు వేస్తున్నారట. మీడియా సమావేశం పెట్టి ఖండించడానికి ఆసక్తి చూపడం లేదట. మహేశ్వర్ రెడ్డి…ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. ఆయన కామెంట్స్‌పై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు. అయితే ఒక్క బీజేపీ నేత కూడా తిరిగి కౌంటర్ ఇవ్వకపోవడంపై పార్టీలో ఏం జరుగుతోందని కింది స్థాయి కార్యకర్తలు చర్చించుకుంటున్నారట. ఈ పరిణామాలు చూస్తుంటే…ఆ పార్టీ నేతల్లో సమిష్టితత్వం లోపించిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఒకరికొకరు అండగా నిలబడకపోతే ఎలా అని కాషాయ పార్టీ కేడర్ ప్రశ్నిస్తోందట. ఇప్పటికైనా నేతలు మారకపోతే…మున్ముందు పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు తయారవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.