Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Tdp Leader Beeda Ravichandra

Off The Record: టీడీపీ నేత బీదా రవిచంద్ర ఎందుకు సైలెంట్ అయ్యారు ? కారణం ఏంటి ?

Published Date :October 22, 2024 , 9:30 pm
By Mahesh Jakki
  • టీడీపీలో కీలకంగా బీదా రవిచంద్ర
  • 2014-19 మధ్య జిల్లాలో చక్రం తిప్పిన నేత
  • బదిలీలు..అధికారిక కార్యక్రమాల్లో హవా
  • ఈసారి కూడా మొదట్లో కీలకంగా బీదా
  • ఆనంకు మంత్రి పదవితో పరిస్థితుల్లో మార్పు?
  • ఆత్మకూరు వ్యవహారాల్లో అభిప్రాయ భేదాలు
  • నియోజకవర్గాల్లో ఇతరులు జోక్యం చేసుకోకుండా తీర్మానం
Off The Record: టీడీపీ నేత బీదా రవిచంద్ర ఎందుకు సైలెంట్ అయ్యారు ? కారణం ఏంటి ?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: నిన్న మొన్నటిదాకా సింహపురి టీడీపీలో ఆయన చెప్పిందే వేదం. మంత్రుల్ని కూడా కాదని బదిలీలు, పోస్టింగ్స్‌ కోసం ఆయన దగ్గరికే పరుగులు పెట్టేవారట ప్రభుత్వ సిబ్బంది. కానీ… ఉన్నట్టుండి సీన్‌ మొత్తం మారిపోయింది. మౌన ముద్ర దాల్చారానేత. ఇంకా చెప్పాలంటే… అసలు నెల్లూరుకే ముఖం చాటేశారట. ఎవరా నేత? ఎందుకా మార్పు? ఆయన అనుచరులేమంటున్నారు?

నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపల్లికి చెందిన బీదా రవిచంద్ర 1999 నుంచి టీడీపీలో యాక్టివ్‌గా ఉన్నారు. అప్పటి మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డికి కుడి భుజంగా వ్యవహరించారాయన. తర్వాత ఆదాల టీడీపీని వీడినా… బీదా మాత్రం కొనసాగుతూ వచ్చారు. 2004 నుంచి 2014 వరకు పార్టీ అధికారంలో లేకపోయినా… పార్టీ జిల్లా అధ్యక్షుడి హోదాలో కార్యకలాపాలు నిర్వహించారు బీదా. ఇక 2014లో టిడిపి అధికారంలోకి రావడంతో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. నాడు జిల్లాలో మంత్రులుగా పొంగూరు నారాయణ… సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నా….. పాలనా వ్యవహారాలన్నీ రవిచంద్ర ఆధ్వర్యంలోనే జరిగేవి. అధికారుల బదిలీలు… అభివృద్ధి పనులు.. పార్టీ కార్యకలాపాల నిర్వహణను ఆయనకే అప్పగించేశారట నాటి మంత్రులు ఇద్దరూ. అప్పట్లో ఆయన సిఫారసు ఉంటే చాలు… ఆటోమేటిగ్గా పనులు జరుగుతాయన్న టాక్‌ ఉండేది. ఈక్రమంలో ఈసారి కూడా ఆయన కీలకంగా మారతారని ఊహించారట అంతా. పార్టీ అధికారంలోకి రాగానే… బదిలీల కోసం పోలీస్‌, రెవెన్యూతోపాటు వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు బీదా సిఫారసు లేఖల కోసం పోటీలు పడ్డారట. అందుకు తగ్గట్టుగానే ఆయన కూడా మొదట్లో స్పందించారన్నది పార్టీ వర్గాల మాట.

కానీ… క్రమంగా పరిస్థితి మారిపోయిందని అంటున్నారు.ఈసారి జిల్లా నుంచి మంత్రులుగా నారాయణతో పాటు ఆనం రామనారాయణరెడ్డికి ఛాన్స్‌ దక్కింది. అక్కడే పాత పరంపర దెబ్బ కొట్టిందని అంటున్నారు. రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లా పర్యటన సందర్భంగా… మంత్రి ఆనం, రవిచంద్ర మధ్య వాగ్వివాదం జరిగింది. ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన టిడిపి నేత కన్నబాబుకు బీద రవిచంద్ర మద్దతు ఇవ్వడం ఆనంకు నచ్చలేదట. ఆ విషయమై ఇద్దరి మధ్య వాగ్వివాదం తీవ్రం కావడంతో మంత్రి నారాయణ జోక్యం చేసుకుని సర్ది చెప్పాల్సి వచ్చింది. ఈ విషయాన్ని అధిష్టానం దగ్గరే తేల్చుకుంటానని మంత్రి ఆనం అనడంతో… అక్కడ తనకే పరపతి ఉందని అన్నారు రవిచంద్ర. కొద్దిరోజులు తర్వాత జిల్లాలోని ఎమ్మెల్యేలు.. ఇతర ప్రజాప్రతినిధులు కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒకరి నియోజకవర్గంలో మరొకరు జోక్యం చేసుకోకూడదని.. ఏదైనా జోక్యం చేసుకోవాల్సి వస్తే సంబంధిత ఎమ్మెల్యే అనుమతితోనే ముందుకు వెళ్లాలని తీర్మానించుకున్నారు. బీద రవిచంద్ర ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసేందుకే ఈ ఏర్పాటని అప్పట్లో పార్టీ నేతలు మాట్లాడుకున్నారు.

ఆ ఎపిసోడ్‌ తర్వాత జిల్లా వ్యవహారాలకు రవిచంద్ర దూరంగా ఉంటున్నారు. తనకు సన్నిహితులైన మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు.. ఇతర నేతలు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మాత్రం వారితో కలిసి తిరుగుతున్నారు. ఎక్కువ సమయం అమరావతికే కేటాయిస్తున్నారట ఆయన. ముఖ్యమంత్రి చంద్రబాబు…మంత్రి లోకేష్‌కు సన్నిహితుడుగా ఉన్న రవిచంద్రకు త్వరలోనే మంచి నామినేటెడ్‌ పదవి వస్తుందని, దానితోనే మా లీడర్‌ సత్తా చాటుతారని అంటున్నారు ఆయన సన్నిహితులు. వాళ్ళు అనుకున్నట్టుగానే బీదాకు ప్రోటోకాల్‌ పోస్ట్‌ వస్తే…. సింహపురి పొలిటికల్‌ సీన్‌ ఎలా మారుతుందో చూడాలంటున్నారు పరిశీలకులు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • ap news
  • beeda ravichandra
  • off the record
  • OTR Story

తాజావార్తలు

  • Youth: ఒక రోజు ఆలస్యంగా థియేటర్స్‌లో ‘యూత్’ సందడి!

  • Kalki 2: మహాభారత పర్వం పీక్స్.. 20 ని. గూస్‌బంప్స్ అంతే!

  • Congress: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. కీలక ఆఫీసుల్ని ఖాళీ చేయాలని కేంద్రం అల్టిమేటం..

  • Puri Jagannath Ratna Bhanda: పూరీ జగన్నాథుడి ‘రత్న గర్భం’ గుట్టు వీడనుంది.. 48 ఏళ్ల తర్వాత తెరుచుకున్న నిధుల గది!

  • Jr NTR : ఎన్టీఆర్ గ్రాండ్ పార్టీ.. డ్రాగన్‌కు స్పెషల్ ట్రీట్!

ట్రెండింగ్‌

  • SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!

  • Shane Warne-RR: షేన్‌ వార్న్‌ మాస్టర్ మైండ్.. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రూ.460 కోట్లు!

  • Rama Navami 2026: సత్యం, ధర్మానికి ప్రతీక.. శ్రీరాముడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు ఇవే..

  • Viral Video: మరీ ఇలా ఉన్నారేంట్రా!.. కుక్కర్లు, పాత్రలు, బకెట్లలో పెట్రోల్ తీసుకెళ్తున్న జనాలు..

  • RCB Sale Price: ఐపీఎల్ చరిత్రలో మరో సంచలన డీల్.. ఆర్‌సీబీ కొత్త ఓనర్స్ ఎవరంటే?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions