Off The Record: ఆ వీడియో ఆయన జీవితాన్ని మార్చేసిందా? ఆ ఫైర్ ఎంపీ మౌనం వెనుక కారణాలేంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: గోరంట్ల మాధవ్.. గతంలో ఈ పేరు చెబితే ఒక వైబ్రేషన్ ఉండేది. కానీ ఇప్పుడు… పేలని టపాసులా సైలెంట్ గా కనిపిస్తున్నారాయన. పోలీసు అధికారిగా ఉన్నప్పుడు నిత్యం వివాదాలతోనే సావాసం చేసేవారు. ఎంపీ అయ్యాక కూడా ఆయన స్టైల్ ఏ మాత్రం మారలేదు. నిత్యం ఏదో ఒక స్టేట్ మెంట్ తో వార్తల్లో నిలిచేవారు. కార్యక్రమం ఏదైనా అటెన్షన్ మాత్రం తన వైపే ఉండేలా చూసుకునేవారాయన. ఎక్కడైనా స్పేస్ లేకపోతే తనకంటూ ఒక స్పేస్ క్రియేట్ చేసుకుని మరీ… ఏదో ఒక విధంగా వార్తల్లో నిలిచేవారు ఎంపీ. వివాదాలు పెరుగుతున్నా… తగ్గేదే లే అన్నట్టుగా ముందుకు వెళ్ళారు. అయితే … సరిగ్గా ఏడాది క్రితం జరిగిన ఆ ఘటన.. ఆ ఒకే ఒక్క వీడియో వివాదం మాధవ్ పొలిటికల్ కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితాన్ని కూడా పూర్తిగా మార్చేసిందట. ఇంకా చెప్పాలంటే… ఆ వివాదాస్పద వీడియో.. ఎంపీ జీవితంలోనే చెరగిన మచ్చగా మిగిలిపోయింది. ఎంత కాదన్నా.. ఆ వీడియోలో ఉన్నది నేనుకాదు, మార్ఫింగ్ అని ఎన్ని కబుర్లు చెప్పినా… జనం మాత్రం నమ్మలేదు.
వీడియో వ్యవహారం తర్వాత మరో వివాదంలో చిక్కుకున్నారు మాధవ్. అనంతపురం సిటీలోని 80 ఫీట్ రోడ్డులో మూడేళ్లుగా ఉంటున్నారాయన. అయితే ఆ ఇంటి అద్దెకు సంబంధించిన విషయంపై పెద్ద గొడవే జరిగింది. ఎంపీ మూడేళ్ళ నుంచి తనకు రెంట్ ఇవ్వడం లేదని, అలాగే కరెంట్ బిల్లు కూడా కట్టడం లేదని ఎంపీతో గొడవపడ్డారు ఇంటి ఓనర్. ఈ వ్యవహారంలో కొందరు పోలీస్ అధికారులు మధ్యవర్తం చేసి రాజీ కుదిర్చారట. ఇది కూడా అప్పట్లో పెద్ద న్యూస్ గా మారింది. ఇక టైం బ్యాడ్ అనుకున్నారో… లేక పొలీస్ ఆఫీసర్ డ్యూటీకి, పొలిటీషియన్ పాత్రకు తేడా ఉంటుందని జ్ఞాన నేత్రాలు తెరుచుకున్నాయోగానీ…అద్దె విషయం సెటిల్ చేసిన తర్వాత పూర్తిగా సైలెంటైపోయారాయన. ఎక్కడైనా ప్రోగ్రాం జరిగితే వచ్చామా వెళ్ళామా అన్నట్టుగానే ఉంది ప్రస్తుతం వ్యవహారం. వరస వివాదాలు వెంటాడుతున్న క్రమంలో ఆయన ఏకంగా వాట్సాప్ వాడటం కూడా మానేసినట్టు చెబుతున్నారు సన్నిహితులు. ముఖ్యమైన విషయాలను కూడా ఫోన్లో అస్సలు మాట్లాడటం లేదట. ఎవరైనా ఎప్పుడైనా మాట్లాడాలంటే నేరుగా వచ్చి పొమ్మంటున్నారట. స్మార్ట్ ఫోన్ యుగంలో ఒక ఎంపీ వాట్సాప్ వాడటం లేదంటే నమ్మశక్యంగా లేకున్నా…వరుస వివాదాల క్రమంలో ఆయన వాట్సాప్ ను పూర్తిగా పక్కన పెట్టేసారన్నదే సన్నిహితుల మాట.
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
మరోవైపు ప్రస్తుతం మాధవ్ అడుగులు ఎటువైపు అన్నది కూడా అర్థం కాని పరిస్థితి. ఈయన విషయంలో అధిష్టానం మనసులో ఏముందన్నది కూడా అంతు చిక్కడం లేదట. అయితే ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ఉన్న ఇద్దరు ఎంపీలను మారుస్తారన్న ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికలలో ఎంపీలు కాస్తా ఎమ్మెల్యే లుగా బరిలోకి దిగుతున్నారని అనుచరులు చెబుతున్నారు. మొత్తం మీద ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ గా కనిపించిన.. గోరంట్ల మాధవ్ ఇప్పుడు మౌనంగా ఉండటం, అదీ స్మార్ట్ ఫోన్ వాడటం లేదనడం ఆశ్చర్యంగా ఉందంటున్నాయి రాజకీయ వర్గాలు.
తాజావార్తలు
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!