Off The Record: బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య ఏం జరుగుతుంది..? గులాబీ తోటలో ఏనుగు విహారం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ మీద సరికొత్త చిత్రం కనిపించబోతోందా? ఊహించని పొత్తుకు వేదిక కాబోతోందా అంటే.. అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. బీఆర్‌ఎస్, బీఎస్పీ నాయకత్వాల మధ్య ఏదో జరుగుతోందన్న ఊహాగానాలే అందుకు కారణం అంటున్నారు. బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్‌ను బీఆర్‌ఎస్‌లో చేరమంటూ ఆహ్వానం అందిందట. లోక్‌సభ ఎన్నికలకు ముందే కారెక్కితే ఉభయతారకంగా ఉంటుందని గులాబీ పెద్దలు కోరినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ప్రవీణ్ మాత్రం ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్టు తెలిసింది. అలాగని మీకూ… మాకూ కుదరదంటూ తెగ్గొట్టినట్టు కూడా మాట్లాడలేదట. ఉభయ తారకం అంటున్నారు కాబట్టి నా దగ్గర ఇంకో ప్రపోజల్ ఉందంటూ గులాబీ నాయకత్వం ముందు తన మనసులోని ఆలోచనను బయట పెట్టినట్టు తెలిసింది. ప్రవీణ్ కుమార్ బీఆర్‌ఎస్‌కు చేసిన ప్రతిపాదన ప్రకారం.. ఆయన నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరపునే పోటీ చేస్తారు. అక్కడ బీఆర్‌ఎస్ అభ్యర్థిని పోటీకి దింపకుండా… తనకు బే షరతుగా మద్దతివ్వాలి. అలా చేస్తే… రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్‌ఎస్ అభ్యర్థులందరికీ బీఎస్పీ మద్దతిస్తుంది.
Read Also: MP Laxman: మోడీని విమర్శించే వారంతా వారి కుటుంబం కోసం మాత్రమే పని చేస్తున్నారు..
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ఇదీ… ప్రవీణ్‌కుమార్ చెప్పిన ఉభయతారక మంత్రం. దీనికి గులాబీ అధినాయకత్వం నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఓకే అంటే గనుక గులాబీ తోటలో ఏనుగు విహారాన్ని చూడబోతున్నామన్న సెటైర్స్ కూడా పడుతున్నాయి. హళ్ళికి హళ్ళి అన్నట్టుగా మద్దతుకు మద్దతే తప్ప తాను మాత్రం కారెక్కే ప్రసక్తే లేదని కూడా కుండబద్దలు కొట్టేశారట ఆయన. నాగర్‌కర్నూల్ నుంచి బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములు ఇటీవల బీజేపీలో చేరారు. ఆయన కుమారుడు భరత్‌కు టిక్కెట్ కన్ఫామ్ చేసింది కమలం పార్టీ. దీంతో నాగర్‌కర్నూల్‌లో దీటైన అభ్యర్థి కోసం వెదుకుతోంది గులాబీ పార్టీ. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ప్రవీణ్‌కుమార్‌కు మద్దతిచ్చి రాష్ట్రమంతటా ఆయన పార్టీ సపోర్ట్ తీసుకుంటారా? లేక మరో అభ్యర్థిని వెదుక్కుంటారా అన్న చర్చ మొదలైంది తెలంగాణ రాజకీయవర్గాల్లో. బయట ఈ తరహా చర్చ జరుగుతుండగానే… బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ప్రవీణ్‌కుమార్ కలవడమే కథలో ట్విస్ట్. మాజీ సీఎంను మర్యాద పూర్వకంగానే కలిశారని పైకి చెబుతున్నా… లోపల రాజకీయ చర్చలు జరగకుండా ఉండాయా అన్న డౌట్స్ వస్తున్నాయి ఎక్కువ మందికి. సమావేశంలో ఆర్‌ఎస్‌తో పాటు బీఎస్పీ ప్రతినిధి బృందం కూడా ఉండటంతో మేటర్ ఇంకా ఇంట్రస్టింగ్‌గా మారింది. మరి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీఎస్పీ కలిసి పనిచేస్తాయా? లేక మీ దారి మీదే, మా దారి మాదేనని అంటాయా అన్నది చూడాలి.
తాజావార్తలు
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!