Off The Record: ఏపీ బీజేపీలో కొత్త అలజడి మొదలైందా? పదవి కోసం పావులు కదుపుతున్నారా?
- వచ్చే మార్చిలో ఎమ్మెల్యే కోటాలో 4 సీట్లు ఖాళీ..
- బీజేపీకి ఒక ఎమ్మెల్సీ సీటు దక్కుతుందన్న లెక్కలు..
- బలపడే అవకాశాన్ని వదులుకోవద్దన్న టార్గెట్..
- కులాల లెక్కలు ప్రధాన పాత్ర పోషించబోతున్నాయా?..
- మళ్ళీ కాపులకేనా? మరో సామాజికవర్గానికి ఇస్తారా?..
- కేబినెట్ బెర్త్ ఆశలతో కొందరి ప్రయత్నాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఏపీ బీజేపీలో కొత్త ఆశలు రేగుతున్నాయి. త్వరలో ఖాళీ అవబోతున్న ఎమ్మెల్సీ సీట్ల కోసం నాయకులు చాపకింద నీరులా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారట.వచ్చే మార్చిలో ఎమ్మెల్యే కోటాలో నాలుగు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవబోతున్నాయి. అందులో ఒకటి బీజేపీకి ఇచ్చే ఛాన్స్ ఉందన్న అంచనాతో… రాష్ట్ర పార్టీ సీనియర్స్ పావులు కదుపుతున్నట్టు సమాచారం. దీంతో పార్టీలో ఇప్పుడు కొత్త లెక్కలు, సరికొత్త సమీకరణలు తెరమీదికి వస్తున్నాయి. గతంలో ఎమ్మెల్యే కోటాలో కాపులకు ఇచ్చి ఉన్నందున ఈసారి కూడా అదే సామాజిక వర్గానికి ఇస్తారా? లేక లెక్కలు మారతాయా అన్న చర్చ నడుస్తోంది పార్టీ వర్గాల్లో. రాష్ట్రంలో తాము బలపడటానికి ఉపయోగపడే ఏ అవకాశాన్ని వదులుకోకూడదని అనుకుంటున్నారట ఏపీ కమలనాథులు. అందుకే ఎంపిక ఆచితూచి ఉంటుందని అంటున్నారు. ఆ కోణంలో చూస్తే… కులాల లెక్కలే ప్రధాన పాత్ర పోషించవచ్చన్నది పార్టీ శ్రేణుల అభిప్రాయం. మరోవైపు ఇప్పటికే ఎమ్మెల్సీలుగా పనిచేసిన కాపు సామాజికవర్గ నేతలు సైతం ట్రయల్స్‌లో ఉన్నట్టు సమాచారం. కానీ… అధిష్టానం మాత్రం మళ్లీ కాపులకే ఇస్తే…. పుంజుకుంటామా? లేక మరో సామాజికవర్గాన్ని దగ్గరకు తీస్తే… సెట్ అవుతుందా అని లెక్కలేసుకుంటోందట.
మరోవైపు ఎమ్మెల్సీ టిక్కెట్ దక్కించుకుని లక్కు కలిసొస్తే… కొన్నాళ్ళ తర్వాతైనా కేబినెట్లో బెర్త్ దక్కించుకుందామని దూరపు ఆలోచన చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారట. దీంతో కాంపిటీషన్ అంతకంతకూ పెరుగుతోందని అంటున్నారు. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని వాళ్ళు మాకేంటి అంటూ…పార్టీ పెద్దల మీద వత్తిడి చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. పార్టీకి వచ్చే అవకాశం ఉన్నది ఒక్క సీటు… అదీకూడా మిత్రపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితేనే. కానీ… ఇటు చూస్తే… ఆశావహుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో ఏం జరగబోతోందంటూ… ఉత్కంఠగా చూస్తున్నాయి ఏపీ కాషాయ శ్రేణులు. విషయం తక్కువ, ఉత్సాహవంతులు ఎక్కువ అన్నట్టుగా మా పార్టీలో పరిస్థితి ఉందంటూ… తమకు తామే సెటైర్స్ వేసుకుంటున్నారట ఏపీ బీజేపీ కార్యకర్తలు. చివరికి ఎవరి ప్రయత్నాలు వర్కౌట్ అవుతాయో…. ఢిల్లీ పెద్దలు ఎవరి పేరు మీద టిక్ పెడతారో చూడాలి మరి.
Also Read
- SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
- Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
తాజావార్తలు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!