Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
- ఏడేళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన షీ జిన్‌పింగ్.. మోదీతో కీలక భేటీ.
- అరుదైన భూ ఖనిజాల సరఫరాపై చైనాతో భారత్ చర్చించే అవకాశం.
- ఎలక్ట్రానిక్స్, ఈవీలు, బ్యాటరీలు, రక్షణ రంగాలకు రేర్ ఎర్త్ మినరల్స్ కీలకం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi-Jinping: బ్రిక్స్ సమావేశాల కోసం చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ న్యూఢిల్లీ వచ్చారు. శనివారం సాయంత్రం భారత మండపంలో ఇరువురు నేతలు భేటీ కానున్నారు. భారత్-చైనా ద్వైపాక్షిక చర్చలకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. వాణిజ్య లోటు, రేర్ ఎర్త్ మినరల్స్, ఎరువు సరఫరా, వాణిజ్య ఒప్పందాల వంటి పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. మోడీ-జిన్‌పింగ్ భేటీపై ప్రపంచ దృష్టి నెలకొంది.
అరుదైన ఖనిజాలపై చర్చ:
ప్రపంచ టెక్నాలజీకి ఇప్పుడు రేర్ ఎర్త్ మెటల్స్, రేర్ ఎర్త్ మాగ్నెట్స్ కీలకంగా మారాయి. ఈ రంగంలో చైనా 90 శాతం వాటాను నియంత్రిస్తోంది. భారతదేశం ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి ప్రయత్నిస్తోంది. సెమీకండక్టర్ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో, భారత ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఈవీ, బ్యాటరీ, రక్షణ, హైటెక్ తయారీ రంగాలకు ఈ అరుదైన రేర్ ఎర్త్ మెటల్స్ చాలా కీలకం. రేర్ ఎర్త్ మెటల్స్ గురించి భారత్, చైనా మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది.
Also Read
- Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
- Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
- SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
వాణిజ్య లోటు:
భారత దేశానికి సంబంధించి ఆందోళన కలిగించే అంశం చైనాతో ఉన్న వాణిజ్యలోటు. చైనా నుంచి భారత్ భారీ స్థాయిలో దిగుమతులు చేసుకుంటోంది. ఇదే సమయంలో చైనాకు భారత ఎగుమతులు చాలా తక్కువగా ఉన్నాయి. 2025లో, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం సుమారుగా $155.6 బిలియన్లకు చేరుకోగా, చైనాతో భారతదేశ వాణిజ్య లోటు సుమారుగా $115 బిలియన్లుగా ఉంది. భారత్ చైనా నుంచి ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, యంత్రాలు, రసాయనాలు, సౌర పరికరాలు, ఇతర వస్తువుల్ని కొనుగోలు చేస్తోంది. ఈ చర్చల్లో భారత వస్తువులకు చైనా తన మార్కెట్ తెరిచేలా ప్రోత్సహించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.
మోడీ-జిన్‌పింగ్ భేటీపై ప్రపంచం దృష్టి:
2020లో గాల్వాన్ సంఘర్షణ తర్వాత భారత్-చైనా సంబంధాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇరు దేశాలు ప్రస్తుతం చర్చలు, వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడం వల్ల ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుతున్నాయి. ఏడేళ్ల తర్వాత తొలిసారి జిన్‌పింగ్ భారత్ వస్తుండటం, మోడీతో భేటీ అవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. జనాభా పరంగా, ఆర్థిక పరంగా అతిపెద్ద దేశాలుగా ఉన్న చైనా, భారత్ కలిసి పనిచేస్తే అది ప్రపంచానికి సహాయంగా ఉంటుంది. దీంతో ఈ భేటీపై ప్రపంచ దృష్టి నెలకొంది.
తాజావార్తలు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!