Off The Record: కన్నతల్లి కడుపుకోతను హేళన చేయడం కాదా..? నాయకులకు బాధ్యత ఉండక్కర్లేదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని సామెత. అందులోనూ.. రాజకీయాల్లో, ప్రజా జీవితంలో ఉండే వారి మాటకు మరింత ప్రాధాన్యత ఉంటుంది. అది నాలుకా.. తాటిమట్టా అని రివర్స్‌లో తిట్టించుకోకుండా.. నోట్లో నుంచి ఎలాంటి ఆణిముత్యాలు బయటికి వస్తున్నాయో స్పృహతో ఉండాలి. అలా కాకుండా.. నోరేకదా.. పెట్టుబడేం లేదు కదా… అని ఇష్టానికి పనిచెబితే…తర్వాత నాలుక మడతేయాల్సి ఉంటుంది. ఉచ్ఛనీచాలు లేకుండా వాగేయడం… తర్వాత తూచ్ అనడం ఇప్పుడు రాజకీయాల్లో సర్వ సాధారణమైపోయింది. ఈ క్రమంలోనే.. తాజాగా కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ముందు ప్రన్నకుమార్ నోటి నుంచి జాలువారిన ఆణిముత్యాల్ని చూస్తే… అసలాయన స్పృహలో ఉండే ఆ మాటలు మాట్లాడారా అన్న అనుమానాలు వస్తున్నాయట విన్నవాళ్ళకు.
ఇటీవల తల్లి దండ్రులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడకన వెళుతూ చిన్నారి లక్షిత పులి బారిన పడటం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. దైవ దర్శనానికి వెళుతున్న భక్తుల భద్రత పై ఆందోళనలు వ్యక్తం అవుతున్న సమయంలో ఈ ఎమ్మెల్యే గారు తన తాటిమట్టకు పనిచెప్పేశారు. లక్షిత మృతిపై అనుమానాలున్నాయని, ఆమె తల్లిదండ్రుల్ని గట్టిగా విచారించాలంటూ ఆయనగారు అన్న మాటల్ని విన్నవాళ్ళంతా నిర్ఘాంతపోయారు. అవి కేవలం మాటలు కాదు… సాక్షాత్తు పేగు బంధాన్ని అవమానించడం. ఓ కన్నతల్లి కడుపుకోతను చులకనగా హేళన చేయడం తప్ప మరోటి కాదన్న మాటలు అప్పుడే వినిపించాయి. చిన్న బిడ్డ పుట్టెంట్రుకలు తీయించడం కోసం ఆరేళ్ళ లక్షిత, బంధువులకతో కలిసి వెళ్లిన ఆ తల్లిదండ్రులకు నిజంగా శపించే శక్తి ఉంటే… ఈ ఎమ్మెల్యే గారు ఏమైపోయేవారో. అంతలా రగిలిపోయి ఉంటారు వాళ్ళు. ఇంటా బయటా ఏకి పారేయడంతో…స్పృహలోకి వచ్చిన ప్రసన్నకుమార్‌రెడ్డి యధావిధిగా నాలుక మడతేసి… తూచ్ నా ఉద్దేశ్యం అదికాదంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ… శూలాల కంటే పదునుగా ఆ తల్లిదండ్రుల హృదయాల్ని తాకి ఆ మాటలు చేసిన గాయాల్ని ఈ ఎమ్మెల్యే గారు మాన్పగలరా? దైవ దర్శనానికి వెళ్ళి బిడ్డను చంపుకునే దౌర్భాగ్యులమా మేం… అని వాళ్ళు అడిగే ప్రశ్నకు ఆయన దగ్గర సమాధానం ఉందా? ఉన్నత పదవుల్లో ఉన్నప్పుడు ఆ మాత్రం విజ్ఞత ఉండక్కర్లేదా? ఎమ్మెల్యే అన్న మాటల్ని విని షాకైన వైసీపీ పెద్దలు కూడా ఫోన్లోలోనే ఆయనకు తలంటారట.
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
ఆ ఎపిసోడ్ ముగుస్తుండగానే… మరో లీడర్ లైన్ లోకి వచ్చేశారు. వేటపాలెం పరిధిలోని రామన్నపేట పంచాయతీలో వార్డులకు ఉప ఎన్నికల సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, వైసీపీ పరుచూరు నియోజకవర్గ ఇంఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ వర్గానికి, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వర్గానికి మధ్య ఘర్షణ జరిగింది. గొడవ సందర్భంగా రెచ్చిపోయిన ఆమంచి… కమ్మ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలా సామాజికవర్గ పుట్టుకదాకా వెళ్లారు. తన ప్రత్యర్ధి అదే కులానికి చెందిన వ్యక్తి కావడంతో… ఆమంచి వ్యాఖ్యలకు అగ్గి రాజుకున్నట్లు అయ్యింది. ముందు మాట్లాడేసి… డ్యామేజ్ బాగా జరిగిందని అర్థం అయ్యాక తీరిగ్గా క్షమాపణలు చెప్పారు ఆమంచి. కమ్మ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని అన్నారు. జరగాల్సిన నష్టం జరిగిపోయాక క్షమాపణల వల్ల ఉపయోగం ఏం ఉంటుందన్నది పార్టీలోనే ఓ వర్గం మాట. ఒక వైపు ఎన్నికల గడువు దగ్గర పడుతుంటే మరింత బాధ్యతగా ఉండాల్సిన సీనియర్ నేతలే ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం పై వైసీపీ అధిష్టానం సీరియస్ అయినట్లు సమాచారం. నోరు అదుపులో పెట్టుకోకపోతే వ్యక్తిగతంగా సదరు నాయకులకే కాదు పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని క్లాస్ తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా నేతలు జాగ్రత్తగా వ్యవహరిస్తారా…లేక నా నోటికి కళ్లెం లేదన్నట్లు ప్రవర్తిస్తారా అన్నది చూడాలి.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!