Off The Record: ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు అభ్యర్థులే కరువయ్యారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో స్తబ్దత నెలకొంది. ఎన్నికల టైం దగ్గర పడుతున్నా అభ్యర్థుల విషయంలో ఇంకా స్పష్టత రాలేదని అసహనంగా ఉన్నాయి పార్టీ శ్రేణులు. అధికార పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడంతో ప్రచారానికి సిద్ధమవుతున్నారు. అదే సమయంలో అసలు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల కొరత ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. నిన్న, మొన్నటి దాకా తీగల కృష్ణారెడ్డి, మహేందర్ రెడ్డి లాంటి సీనియర్స్ కారు పార్టీకి బైబై చెప్పి కాంగ్రెస్ లోకి వస్తారని గంపెడాశలు పెట్టుకున్నారు కాంగ్రెస్ నేతలు. కొందరైతే… బీఆర్ఎస్ నేతలతో రహస్య సమావేశాలు జరిపి సీట్ల కేటాయింపుతో పాటు ఇతర అంశాలపై పెద్ద ఎత్తునే చర్చలు నిర్వహించారు. అయితే అధికార పార్టీ…సిట్టింగ్‌లకు సీట్లు ఇవ్వడంతో పాటు ఆశావాహులందరిని ప్రగతి భవన్‌కు పిలిచి వారికి కావాల్సిన హమీలు ఇచ్చి దారికి తెచ్చుకోవడంతో.. మొదట్లో కాస్త కనిపించినా… క్రమంగా అసంతృప్తులు చల్లబడ్డాయి. దీంతో కాంగ్రెస్ నేతలు కంగుతింటున్నారట.
ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది కారు దిగి చెయ్యి పట్టుకుంటారని అనుకున్నా… ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా ఆ వాతావరణమే కనిపించడం లేదంటున్నారు. బీఆర్ఎస్ వలసలపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ నేతలు అలాంటి వాతావరణం కనిపించకపోవడంతో ఇక బీజేపీలోని జిల్లాకు చెందిన బలమైన నేతలకు గాలం వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అటు బీఆర్ఎస్ అసంతృప్తులపై బీజేపీ సైతం ఆశలు పెట్టుకున్నా… ఉపయోగం లేకుండా పోయిందట.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉమ్మడి రంగారెడ్డిలోని పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్దులు కరువయ్యారన్నది పార్టీ వర్గాల మాట. ఉదాహరణకు మహేశ్వరంలో మంత్రి సబితారెడ్డి బరిలో ఉన్నారు. మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి అసంతృప్తితో బయటికి వస్తే .. మహేశ్వరం టిక్కెట్ ఇచ్చి సబిత మీద పోటీ పెడదామనుకున్నారట కాంగ్రెస్ నాయకులు. కానీ.. ఆ ఆశలు నెరవేరలేదు. ప్రస్తుతం అక్కడ బడంగ్పేట్ మేయర్ పారిజాత, డిసిసి అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, దేపా భాస్కర్‌రెడ్డి, ఏనుగు జంగారెడ్డి లాంటి చాలా మంది నేతలు టిక్కెట్ ఆశిస్తున్నా… వారిలో ఎవరికీ సబిత స్థాయి లేదని పార్టీలోనే చర్చ నడుస్తోంది. గెలుపు సంగతి పక్కనపెడితే…వీరిలో ఎవరికీ కనీస పోటీ ఇచ్చే సామర్ధ్యం లేదంటున్నారు.
Also Read
- Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
- Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్‌తో 'జై షా' కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
దీంతో ప్రస్తుతం మహేశ్వరం కాంగ్రెస్ దిక్కు మొక్కు లేకుండా ఉందట. ఇక ఎన్నికలకు సమయం పెద్దగా లేకపోవడంతో స్థానిక కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన పెరుగుతోంది. ఇద్దరు ముగ్గురు పోటీలో ఉంటే… ఎవరో ఒకరికి టిక్కెట్ ఇస్తారు…మనం బరిలో ఉంటామన్న ధీమాతో పనిచేయవచ్చు. కానీ… అసలు అభ్యర్థి ఎవరో తెలీదు, పని చేయాలన్న ఉత్సాహం ఎలా వస్తుందని అడుగుతున్నారట కార్యకర్తలు.
తాజావార్తలు
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Today Gold and Silver Prices: బంగారం కొనాలనుకుంటున్నారా? తాజా గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవిగో.. తగ్గాయా? పెరిగాయా?
-
Ram Charan : ‘పెద్ది’ని చూసి రామ్ చరణ్ ఎమోషనల్… వీడియో వైరల్
-
Rebal Star Fans : రెబల్ స్టార్ ఫ్యాన్స్ తో మాములుగా ఉండదు
-
Shreyas Iyer: నేనింతే.. ఎవరి కోసం నేను మారను.. సర్పంచ్ సాబ్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!