ఆయన కండువా మార్చేశారు.. కండువా మార్చిన ఉద్దేశం నెరవేరకపోవడంతో పార్టీ, ప్రభుత్వంపై మాటలు కూడా మార్చేస్తున్నారు. కుంపటి పెడితే దారిలోకి వస్తారని ఆనుకున్నారో ఏమో కానీ.. పెద్దాయన రివర్స్ గేర్ వేశారు. ఇంతకీ ఎవరా నేత? ఏంటా కథ?.
అది ప్రైమ్ లొకేషన్. గుంట, అర గుంట భూమి కాదు.. 12 ఎకరాల ప్రభుత్వ భూమిపై కన్నేశారు ఓ నేత. ఆక్రమణ చాలా రోజులుగా నడుస్తోంది. కానీ.. ఇప్పటి వరకు దానివైపు అధికారులు ఎవరు కూడా కన్నెత్తి చూడలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో…అక్రమార్కుల పట్ల కూడా కఠినంగా ఉండాలని ఆదేశించారు. దీంతో 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడారు అధికారులు. అది అంతా ఇంత కాదు.. ఏకంగా 600 కోట్ల భూమి ప్రభుత్వానికి దక్కింది. అసలు విషయానికి వెళ్తే..సర్వే నెంబర్ 102/1HAK/1 లో 12 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. 12 ఎకరాల ప్రభుత్వ స్థలంలో కబ్జాకు గురైన ప్రాంతంలో కట్టడాలు చేశారు. కబ్జాదారుడు దర్జాగా..టెంట్ వేసి తన మనుషులను కాపలా పెట్టారు. ఇదంతా ప్రభుత్వానికి నివేదించారు రెవెన్యూ అధికారులు. చాలా రోజులుగా జరుగుతున్న తంతుకి చెక్ పెట్టారు. నిర్మాణలు కూల్చివేశారు. బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం ముందు కబ్జాకు గురైన భూమి తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పరిశీలించారు. ఇంత వరకు బాగానే ఉంది కానీ.. అసలు ఈ కబ్జా వెనక ఉన్నది ఎవరువనేది అసలు చర్చ మొదలైంది.
Also Read: Off The Record: ఆ కేసులు నాయకుల మెడకు చట్టుకుంటాయా?.. తలలు పట్టుకుంటోన్న వైసీపీ కేడర్
గులాబీ పార్టీ తరపున సదరు ఎమ్మెల్యే…తనకు అక్రమంగా వచ్చిన భూములను కాపాడుకోవడానికి అధికార పార్టీలో చేరారనే చర్చ నడుస్తోంది. సదరు నేత హ్యాండ్‌లోనే ఏసీబీ కార్యాలయం ఎదురుగా ఉన్న భూమి ఉందట. అక్రమంగా వెలిసిన నిర్మాణాలు నేలమట్టం అవ్వగానే… స్థానిక రెవెన్యూ అధికారికి సదరు నేత నుంచి ఫోన్ కాల్ వెళ్లిందట. ఏం చెప్పాలో తెలియక సదరు అధికారి తనపై అధికారికి ఫోన్ చేసి సమస్యను చెప్పుకున్నారట. ఇక ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాలని చెప్పేశారట. కాంగ్రెస్ పార్టీలో చేరి…భూమి వ్యవహారాన్ని సెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అంత వరకు వ్యవహారం బాగానే ఉన్నా…పని చేయలేదని ప్రభుత్వం మీద నెగిటివ్ కామెంట్స్ చేసి దారిలోకి తెచ్చుకోవాలని అనుకున్నారేమో.. కానీ ప్లాన్ రివర్స్ అయ్యింది. తాను ఒకటి తలిస్తే… దైవం మరొకటి తలిచింది అన్నట్టు సదరు నేత పరిస్థితి తయారైంది. అందరిని గ్రిప్‌లోకి తెచ్చుకోవాలని చూశారు…కానీ అది రివర్స్ అవ్వడంతో ఇపుడు యాక్షన్ ప్లాన్ ఏదో రెడీ చేసుకుని ఉంటారు అనే టాక్ మొదలైంది.
