Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Odisha Woman Unhappy About 2nd Girl Child Sells Daughter For Rs 800

New Born Sold for Rs.800: రూ.800 కోసం 8 నెలల చిన్నారిని అమ్మేసిన కసాయి తల్లి

Published Date :July 5, 2023 , 5:28 pm
By Mahesh Jakki
New Born Sold for Rs.800:  రూ.800 కోసం 8 నెలల చిన్నారిని అమ్మేసిన కసాయి తల్లి
  • Follow Us :
  • google news
  • dailyhunt

New Born Sold for Rs.800: నవమాసాలు మోసి కన్న బిడ్డను దారుణంగా అమ్మేసింది ఓ కసాయి తల్లి. ముక్కుపచ్చలారని 8 నెలల పసికందును రూ.800లకు బేరం పెట్టింది. ఒడిశాలోని మయూర్‌ భంజ్ జిల్లా ఖుంటా పోలీసు స్టేషన్ పరిధిలోని మహూలియా గ్రామంలో చోటుచేసుకున్న ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న కరామి ముర్ము అనే ఒడిశా గిరిజన మహిళ రెండో సారి కూడా ఆడబిడ్డ పుట్టడంతో బాధపడి, తన ఎనిమిది నెలల కుమార్తెను దంపతులకు రూ.800కు విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. కనికరం లేని ఆ తల్లిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. తన భర్త పనిపై తమిళనాడుకు వెళ్లిన టైంలో.. ఆ మహిళ తన 8 నెలల ఆడబిడ్డను రూ.800కు మాహీ ముర్ము అనే వ్యక్తి మధ్యవర్తిత్వంతో ఫుల్‌మండి మరాండి, టుదుకుడ్ దంపతులకు విక్రయించింది. సోమవారం రోజు (జులై 3న) పసికందు అమ్మకం జరిగింది.

Also Read: Tamilnadu: ఇకపై అతిథుల డ్రైవర్లకు హోటళ్లలో వసతి, బాత్‌రూమ్‌లు తప్పనిసరి

తండ్రి ముసు ముర్ము తమిళనాడు నుంచి ఇంటికి తిరిగి వచ్చి అతని రెండవ కుమార్తె గురించి ఆరా తీస్తే.. అతని భార్య చిన్నారి చనిపోయిందని చెప్పింది. పొరుగువారు అతనికి ఒప్పందం గురించి తెలియజేశారు. ఏం జరిగిందో తెలిసిన తర్వాత సోమవారం కుంట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. “తమిళనాడు నుంచి నేను ఇంటికి వచ్చేసరికి నా చిన్న కూతురు కనిపించలేదు. అనంతరం నా భార్యను అడగగా.. బిడ్డ చనిపోయిందని చెప్పింది. పొరుగువారు జరిగిన విషయం చెప్పారు. దీంతో వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను” అని పసికందు తండ్రి చెప్పాడు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ముసు భార్యను, బిడ్డను కొనుగోలు చేసిన దంపతులను, మధ్యవర్తిని మంగళవారం అరెస్టు చేశారు.

మయూర్‌భంజ్ పోలీసు సూపరింటెండెంట్ బత్తుల గంగాధర్ మాట్లాడుతూ, మహిళ తన చిన్నారితో వెళ్లి ఒంటరిగా తిరిగి వచ్చింది. చిన్నారి గురించి గ్రామస్తులు ఆమెను ప్రశ్నించగా.. ఆమె చనిపోయిందని కరామి చెప్పిందని ఆయన తెలిపారు. పోలీసులు పసికందును రక్షించి చైల్డ్ కేర్‌కు పంపినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Crime News
  • girl child
  • Mayurbhanj
  • New Born Sold
  • New Born Sold for Rs.800

తాజావార్తలు

  • 2BHK Rent: వామ్మో.. భారత్‌లోని ఈ నగరంలో డబుల్ బెడ్రూమ్ అద్దె రూ. 3 లక్షలు!

  • Krithi Shetty: చాలా కాలం తర్వాత ప్యూర్ లవ్ స్టోరీ చేస్తున్నా..

  • AP Liquor Case: ఏపీ లిక్కర్‌ కేసులో కీలక పరిణామం.. ఏ1 రాజ్‌ కేసిరెడ్డికి బెయిల్‌

  • Air India: ఛార్జీలు పెంచిన ఎయిర్ ఇండియా.. ప్రయాణికులపై మరింత భారం..

  • Pakistan in Crisis: తీవ్ర సంక్షోభంలో పాక్‌.. నూనె లేదు, పిండి లేదు, కరెంట్‌ లేదు.. ఇప్పుడు లాక్‌డౌన్‌..!

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions