Train Incident: ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కామాఖ్య ఎక్స్‌ప్రెస్!
- ఓడిశాలో రైలు ప్రమాదం
- బెంగళూరు నుంచి గువాహటి వెళ్తున్న కామాఖ్యా ఎక్స్‌ప్రెస్ (12251) రైలు 11 బోగీలు పట్టా తప్పాయి.
- తాజా ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం లేదని అధికారులు ధృవీకరణ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Train Incident: ఓడిశాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి గువాహటి వెళ్తున్న కామాఖ్యా ఎక్స్‌ప్రెస్ (12251) రైలు 11 బోగీలు పట్టా తప్పాయి. ఈ ఘటన గత రాత్రి 11.54 గంటల సమయంలో కటక్ సమీపంలోని నేరగుండి స్టేషన్ (ఖుర్దా డివిజన్) వద్ద చోటు చేసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అయితే, అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని ఈస్ట్ కోస్ట్ రైల్వే సీపీఆర్‌ఓ అశోక్ కుమార్ మిశ్రా వెల్లడించారు. పట్టాలు తప్పిన 11 బోగీలు ఏసీ కోచ్‌లు అని అధికారాలు తెలిపారు. ఘటనకు విషయం తెలిసిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. రైల్వే ఉన్నతాధికారులు ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకొని పునరుద్ధరణ పనులను ప్రారంభించారు.
Read Also: SRH-HCA: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరోపణలపై స్పందించిన హెచ్‌సీఏ!
Also Read
- Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
- Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
- Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
ఈ ప్రమాదం కారణంగా కొన్ని రైళ్ల రూట్‌ను మార్చారు. మళ్లీ ట్రాక్ పునరుద్ధరించే వరకు కొన్ని రైళ్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్తాయని రైల్వే అధికారులు ప్రకటించారు. రైల్వే శాఖ ప్రయాణికుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లను విడుదల చేసింది. దిగ్విజయ్ ప్రాంతానికి చెందిన టెలిఫోన్ నంబర్ 8991124238 ను అందుబాటులో ఉంచారు. ఈ మధ్య కాలంలో ఓడిశాలో రైలు ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. 2023లో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. శాలిమార్-చెన్నై కొరొమండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, ఓ మాల్గాడి రైలు ఒకదానికొకటి ఢీకొనడంతో 296 మంది మరణించగా, 1,200 మందికిపైగా గాయపడ్డారు. ఇంతక ముందు 2022లో, కోరాయి రైల్వే స్టేషన్ వద్ద ఓ మాల్గాడి పట్టాలు తప్పి స్టేషన్ భవనాన్ని బలంగా ఢీకొంది. ఆ ఘటనలో రెండు మంది మరణించగా, 12 బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
#WATCH | Cuttack, Odisha: 11 coaches of 12551 Bangalore-Kamakhya AC Superfast Express derailed near Nergundi Station in Cuttack-Nergundi Railway Section of Khurda Road Division of East Coast Railway at about 11:54 AM today. There are no injuries or casualties reported till now. pic.twitter.com/xBOMH4nRRh
— ANI (@ANI) March 30, 2025
ఇప్పటివరకు జరిగిన తాజా ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం లేదని అధికారులు ధృవీకరించారు. అయితే, ప్రమాదానికి గల కారణాన్ని పరిశీలించేందుకు రైల్వే ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. రైల్వే మార్గం పునరుద్ధరించేందుకు ప్రమాద సహాయ బృందాలు, అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.
తాజావార్తలు
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!