Sudarsan Pattnaik: దీపావళి సందర్భంగా ప్రముఖ సైకత కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ 4,045 దీపాంతాలను ఉపయోగించి ఓ అద్భుతమైన కళాఖండాన్ని సృష్టించాడు. దేశప్రజలకు ఆలోచింపజేసే సందేశంతో దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ 4045 దీపాంతలతో కాళీమాత సైకతశిల్పాన్ని తయారుచేశారు. వెలుగుల పండుగ వేళ ప్రతికూలతలను కాల్చివేద్దామని ఈ సందర్భంగా సుదర్శన్ పట్నాయక్ చక్కని సందేశాన్ని తెలియజేశారు. దీపావళికి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందామని, కాలుష్య రహితంగా వెలుగుల పండుగను జరుపుకుందామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే అతను ఈ శిల్పాన్ని పూర్తి చేయడానికి 5 గంటల సమయం తీసుకున్నాడు. ఆయనతో సాండ్ ఆర్ట్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులు చేతులు కలిపారు.
Read Also: Thangalaan: మరో క్రేజీ పాత్రలో చియాన్ విక్రమ్.. విభిన్న కథనంతో ‘తంగలాన్’
ఒడిశాలోని పూరీ సముద్ర తీరంలో ఐదు గంటలపాటు శ్రమించి ఆరు టన్నుల ఇసుకతో కాళీ మాత సైకత శిల్పాన్ని రూపొందించారు. మొత్తం 4045 దీపాంతలతో ఐదు ఫీట్ల విగ్రహాన్ని కలర్‌ఫుల్‌గా తయారుచేశారు. తన ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఆయనకు సహాయం చేశారు. పద్మ అవార్డు గ్రహీత సైకత శిల్పకారుడు సుదర్శన్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 60కి పైగా అంతర్జాతీయ సాండ్ ఆర్ట్ ఛాంపియన్‌షిప్‌లు, ఫెస్టివల్స్‌లో పాల్గొని అనేక బహుమతులను గెలుచుకున్నాడు. ఇంకో ముఖ్య విషయమేమిటంటే ఇసుకతో కళాఖండాలను సృష్టించడమే కాకుండా, ఆ కళ ద్వారా అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తాడు.