Site icon NTV Telugu

AOB: ఏవోబీలో భద్రతా బలగాలకు తప్పిన పెనుముప్పు

Huge Dump

Huge Dump

AOB: అల్లూరి సీతారామరాజు జిల్లా ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో భద్రతా బలగాలనకు పెనుముప్పు తప్పింది. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల భారీ డంపును ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మత్తిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కిరిమితి, తులసి అటవీ ప్రాంతంలో భారీ డంప్‌ బయటపడింది. డంపులో ఒక దేశవాళి తుపాకీ, 150 జిలెటిన్‌ స్టిక్స్, 13 మందు పాత్రలు లభించాయి. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని డంపులో దాచి పెట్టారని పోలీసులు భావిస్తున్నారు.

Also Read: Kishan Reddy: దమ్ముంటే మెడికల్ కాలేజీలకు రాసిన ఉత్తరాలు బయటపెట్టు.. కేసీఆర్‌కు సవాల్

భ‌ద్రతా బ‌ల‌గాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఆంద్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టులు ఏర్పాటుచేసిన రెండు మందుపాత‌ర‌ల‌ను గాలింపు సందర్భంగా బ‌ల‌గాలు స్వాధీనం చేసుకున్నాయి. వీటిపై ప‌క్కా స‌మాచారం అందుకున్న ఒడిశా పోలీసులు గాలింపు చ‌ర్యలు నిర్వహించి డంప్‌ను క‌నుక్కున్నారు.

Exit mobile version