Maoist: ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లోని మల్కన్‌గిరి జిల్లా పోలీసులు కీలకమైన మావోయిస్టులను అరెస్టు చేశారు. మావోయిస్టు పార్టీ కంగేరి ఘాటి ఏరియా కమిటీ సభ్యుడు
కేసా కవాసి, ఏవోవీ మిలటరీ ప్లాటును కమిటీ సభ్యుడు, ఏరియా కమిటీ సభ్యుడు రాకేష్ సాను కుంజమ్ లను అరెస్ట్ చేశారు.. ఈ విషయాన్ని మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ వినోద్ పాటిల్ తెలిపారు. జిల్లాలోని మథిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సోసిగూడ మరియు టెంటులిగూడె గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల సంఘటనలో తప్పించుకోడానికి ప్రయత్నిస్తున్న వీరిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. మావోయిస్టుల కదలికలపై అందిన సమాచారం ఆధారంగా, మల్కన్‌గిరి జిల్లా పోలీసులు ప్రత్యేక గాలింపు చర్యలను చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి మావోయిస్టుల కదలికలను గుర్తించిన పోలీసులు లొంగుపొమ్మని సూచన చేయగా మావోయిస్టులకు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.. ప్రతిగా పోలీసులు కూడా కాల్పులు జరిపారని, మావోయిస్టులు కాల్పులు జరుపుకొని పారిపోయారని వారిని పోలీసులు వెంబడించిన సమయంలో ఇద్దరు మావోయిస్టులు తప్పించుకోవడానికి ప్రయత్నించగా వారిని అదుపులో తీసుకున్నట్లు మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ తెలిపారు..
Read Also: Forced Debt Collection: బలవంతంగా అప్పు వసూలు చేస్తే జైలుకే.. బిల్లుకు ఆమోదం
