Site icon NTV Telugu

Puri Jagannath Temple: పూరి జగన్నాథ ఆలయంలో ఒడిశా సీఎం ప్రత్యేక పూజలు..

Puri Temple

Puri Temple

ఒడిశా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయం పూరి జగన్నాథ దేవాలయంలో గల నాలుగు ద్వారాలు ఇవాళ తెరచుకున్నాయి. ఈ ఉదయం వేదమంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీఎం మోహన్‌ చరణ్‌ మాఝీతో పాటు మంత్రులందరూ పాల్గొన్నారు. ఇప్పటి నుంచి నాలుగు ద్వారాల గుండా భక్తులు ఆ పూరి జగన్నాథుడిని దర్శించుకునే అవకాశం కలిగిందని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలులోకి తీసుకొచ్చామన్నారు. ఆలయ పరిరక్షణ, మందిరానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం 500 కోట్ల రూపాయల కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేశాం.. వచ్చే బడ్జెట్‌లో ఈ నిధులను రిలీజ్ చేస్తామని ముఖ్యమంత్రి మఝీ వెల్లడించారు.

Read Also: Telangana Ministers: నేడు ఖమ్మంకు నలుగురు మంత్రులు.. సీతారామ ప్రాజెక్టు పర్యవేక్షణ..

ఇక, 12వ శతాబ్దం నాటి ఈ పురాతన పూరి జగన్నాథ ఆలయంలో నేటి వరకు ఒక్క ద్వారం నుంచి మాత్రమే భక్తులను లోపలికి అనుమతిస్తున్నారు. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభనకు ముందుకు వరకు దేవాలయంలోని నాలుగు ద్వారా నుంచి భక్తుల ప్రవేశానికి పర్మిషన్ ఉండేది. కానీ, కొవిడ్‌ వల్ల ఒక్క ద్వారం నుంచే భక్తులను అనుమతించారు. ఇక, అప్పటి నుంచి గత ప్రభుత్వం ఆలయానికి గల మూడు ద్వారాలను ఓపెన్ చేయలేదు. ఈ నేపథ్యంలో భక్తుల ఇబ్బందులను దృష్ట్యా కొత్తగా ఏర్పడిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నేడు ఆలయ నాలుగు ద్వారాలను తెరిచింది.

Exit mobile version