Tragedy: అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో భార్య మృతదేహాన్ని బంధువుల సాయంతో 20 కిలోమీటర్లు భుజాలపై మోసుకెళ్లిన దయనీయ ఘటన ఒడిశాలోని నవరంగపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. మృతురాలి భర్త తెలిపిన వివరాల ప్రకారం.. 3 నెలల క్రితం తన భార్య కరుణ కరుణ అమానత్య(28) ఆడపిల్లకు జన్మనిచ్చిందనే కారణంతో కోరాపుట్ జిల్లా పూర్ణగూడ పంచాయతీ కుమిలి గ్రామంలోని తన పుట్టింటికి వెళ్లింది. శుక్రవారం రాత్రి కరుణ ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు విడిచింది. అత్తవారింట్లో అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతదేహాన్ని నవరంగపూర్ జిల్లా జగన్నాథ్‌పూర్ పంచాయతీ పూపూగౌకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకుని పలు మార్లు అంబులెన్స్ కోసం కాల్ చేశారు.
Read Also: Road Accident : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
ప్రభుత్వ అంబులెన్స్ లభించకపోవడంతో ప్రైవేటు అంబులెన్స్‌లో తరలించేందుకు ఆర్ధిక పరిస్థితి బాగాలేని కారణంగా తప్పని పరిస్థితుల్లో మృతదేహాన్ని ఒక మంచాన్ని డోలిగా కట్టి తీసుకువెళ్లారు. కుటుంబీకుల సహాయంతో మృతదేహాన్ని మంచంపై వేసి భుజాలపై 20 కిలోమీటర్లు మోసుకెళ్లారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది. దీంతో ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశమైంది.
